కంటి వైద్యశిబిరానికి విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

కంటి వైద్యశిబిరానికి విశేష స్పందన

Mar 30 2026 8:38 AM | Updated on Mar 30 2026 8:38 AM

కొరుక్కుపేట: వెంకటేశ్వర భక్త సమాజం–పెరంబూర్‌, ఉదీ కంటి ఆస్పత్రి–ఆళ్వార్‌పేట సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. చైన్నె పెరంబూర్‌లోని వెంకటేశ్వర భక్త సమాజం ఆనంద నిలయంలో సమాజం అధ్యక్షుడు తమ్మినేనిబాబు అధ్యక్షతన వైద్యశిబిరాన్ని పారిశ్రామికవేత్త వి.జంబులింగం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇందులో ఉది కంటి ఆస్పత్రి వైద్య బృందం పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు ఉచితంగా అందజేశారు. అలాగే క్యాటరాక్ట్‌ బాధితులకు ఉచితంగా శస్త్రచికిత్స చేయనున్నట్టు తమ్మినేని బాబు తెలిపారు. వెంకటేశ్వర భక్త సమాజం సెక్రటరీ ఎస్‌.వెంకట్రామన్‌, సహాయ కార్యదర్శి పి.రవికుమార్‌, కోశాధికారి వెంకట రమణుడు, ట్రస్టీ పి.రామచంద్రన్‌, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement