కమనీయం..సీతారాముల కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం..సీతారాముల కల్యాణం

Mar 30 2026 8:38 AM | Updated on Mar 30 2026 8:38 AM

కొరుక్కుపేట: చైన్నె పులియాంతోపు నరసింహనగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం వేదపండితులు వేంకటేశ్వరస్వామికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులను అలకంరించి వేదికపై ఆశీనులు చేశారు. అనంతరం సీతారాములకు కల్యాణాన్ని కమణీయంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి తరించారు. ఆలయ ప్రెసిడెంట్‌ పండిట్‌ జయరాములు, కార్యదర్శి కోటపాటి వెంకటేశ్వర్లు, కోశాధికారి మాధవమూర్తి, డాక్టర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్చరల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు కొండయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement