ఓటర్లపై హామీల వర్షం | - | Sakshi
Sakshi News home page

ఓటర్లపై హామీల వర్షం

Mar 30 2026 8:37 AM | Updated on Mar 30 2026 8:37 AM

రూ. 20 వేల కోట్లతో రాష్ట్ర

సమగ్రాభివృద్ధి ప్యాకేజీ

అన్ని వర్గాలనూఆకర్షించే విధంగా మేనిఫెస్టో

చైన్నెలో విడుదల చేసిన స్టాలిన్‌

ద్రావిడ మోడల్‌ 2.ఓ ప్రభుత్వం షురూ అని స్పష్టం

మహిళా హక్కుల ఆర్థిక సాయం నెలకు రూ. 2,000లకు పెంపు.

పుదుమై పెన్‌ పథకం మేరకు ఉన్నత విద్యనుఅభ్యషించే విద్యార్ధినులకు ఇక, రూ. 1500 పంపిణి

వృద్ధాప్య పింఛను రూ. 1,200 నుండి రూ. 2,000లకు పెంపు.

దివ్యాంగుల పింఛను రూ. 2,500లకు పెంపు.

మత్స్యకారుల వేట నిషేధకాలపు సాయం రూ.12,000లకు పెంపు.

ముఖ్యమంత్రి అల్పాహార పథకం ఇకపై 8వ తరగతి వరకు అమలు (15 లక్షల మందికి ప్రయోజనం).

35 లక్షల మంది ఉన్నత విద్యను అభ్యషించే విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.

అన్ని ప్రభుత్వ ఆర్ట్స్‌ ్స కళాశాలల్లో వై–ఫై సదుపాయంతో కూడిన డిజిటల్‌ లెర్నింగ్‌ సెంటర్లు.

1.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.

రూ. 18 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించి 50 లక్షల మంది విద్యార్థులకు ఉపాధి కల్పన.

ఐటీ ఎగుమతులను రూ. 5 లక్షల కోట్లకు పెంచడం.

20 లక్షల మంది రైతులకు మీటర్లు లేని అధునాతన పంపుసెట్ల పంపిణీ.

వరి క్వింటాల్‌కు రూ. 3,500, చెరకు టన్నుకు రూ. 4500, పాల కొనుగోలు ధర లీటరుకు రూ. 5 అదనంగా పెంపు. సాగు భూమిని 50 లక్షల హెక్టార్లకు విస్తరించడం.

ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం పరిమితి రూ. 10 లక్షలకు పెంపు. ఇందుకు వార్షిక ఆదాయ పరిమితిని రూ. 5 లక్షలుగా నిర్ణయిస్తూ హామి. మదురై, సేలం, కోయంబత్తూరు సహా 11 జిల్లాల్లో క్యాన్సర్‌ చికిత్స కేంద్రాలు. జిల్లా, డివిజన్‌ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ యంత్రాల సంఖ్యను రెట్టింపు.

రాబోయే 5 ఏళ్లలో 10,000 కొత్త బస్సుల కొనుగోలు

తిరుచ్చి, మదురై, సేలం సమీపంలో సరికొత్త శాటిలైట్‌ నగరాల నిర్మాణం.

5,000 ఆలయాలకు కుంభాభిషేకం, 1,000 శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణ.

చైన్నెలో ఘనంగా ’సెమ్మొళి’ (క్లాసికల్‌ లాంగ్వేజ్‌) సదస్సు.

రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం 10 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం.

1.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

కేంద్ర ప్రభుత్వ 8వ వేతన సంఘం అమలులోకి రాగానే, రాష్ట్రంలోనూ వెంటనే అమలు చేస్తాం

ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పిస్తాం

కొత్తగా 2 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేక టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేస్తాం

ప్రకృతి విపత్తుల వలన నష్టపోయిన వరి రైతులకు హెక్టారుకు రూ. 25,000 పరిహారం చెల్లిస్తాం.

మహిళా సంఘాలకు రూ.5లక్షల వరకు రాయితీతో కూడిన రుణాలు

మైనారిటీల రుణపరిమితిని రూ. 30లక్షలకు పెంచడం.

అన్ని జిల్లాలో క్రీడా హాస్టళ్ళ ఏర్పాటు

1000 అంగన్‌ వాడి కేంద్రాల నిర్మాణం

ఉత్తర జిల్లాలు, డెల్టా, పశ్చిమ జిల్లాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని రూ. 20 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ.

సాక్షి, చైన్నె : ద్రావిడ మోడల్‌ 2.ఓ ప్రభుత్వమే లక్ష్యంగా ప్రజలపై వరాల జల్లులను డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్‌ కురిపించారు. రూ. 20 వేల కోట్లతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్యాకేజి పేరిట బృహత్తర కార్యక్రమాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. అన్ని వర్గాలను ఆకర్షించే రీతిలో పలు అంశాలను ఎన్నికల వాగ్దానంగా ప్రకటించారు. వివరాలు.. డీఎంకేకు ప్రతి ఎన్నికలలో మేనిఫెస్టో అన్నది కీలక అన్న విషయం తెలిసిందే. అందుకే ప్రతి సారీ డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నేత కనిమొళి నేతృత్వంలోని కమిటీ ద్వారా మేనిఫెస్టోను స్టాలిన్‌ రూపొందించడం జరుగుతోంది. ఆదిశగా గత కొన్ని నెలలుగా ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించింది. అన్ని వర్గాల అభిప్రాయలను సేకరించింది. అందర్నీ ఆకర్షించడమే కాకుండా, ప్రధానంగా మహిళ, యువత ఓటు బ్యాంక్‌ను గురి చేస్తూ వాగ్దానాల వర్షం కురిపించే విధంగా మేనిఫెస్టోకు రూపకల్పన చేసింది.

మేనిఫెస్టో విడుదల

చైన్నెలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఆదివారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్‌, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కనిమొళి కరుణానిధి, తిరుచ్చి శివ, కోశాధికారి టీఆర్‌బాలుతో పాటుగా మేనిఫెస్టో కమిటీలోని ప్రతినిధులు పాల్గొన్నారు. గత ఐదేళ్ల ద్రావిడ మోడల్‌ పాలనలో సాధించిన విజయాలను గుర్తుచేస్తూనే, రాబోయే ఐదేళ్లలో ‘ద్రవిడ మోడల్‌ 2.0‘ ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం స్టాలిన్‌ హామీ ఇచ్చారు. అలాగే కీలక వాగ్దానంగా గృహిణులకు కానుక పేరిట ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలలోని గృహిణులకు రూ. 8,000 విలువైన కూపన్లు అందజేస్తారు. వీటితో వాషింగ్‌ మెషీన్‌, టీవీ, ఫ్రిజ్‌, మిక్సీ, మైక్రోవేవ్‌ ఓవెన్‌ వంటి వస్తువులను వారే స్వయంగా కొనుగోలు చేయవచ్చు లేదా పాతవాటిని మార్చుకోవచ్చు అని ప్రకటించారు.

కీలక వాగ్దానాలు ఇవే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement