వందశాతం పోలింగ్‌పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

వందశాతం పోలింగ్‌పై అవగాహన

Mar 29 2026 7:15 AM | Updated on Mar 29 2026 7:15 AM

వేలూరు: అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం పోలింగ్‌ జరగాలని కోరుతూ వేలూరులోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎన్నికల అధికారి సుబ్బులక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఏప్రిల్‌ 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వేలూరు జిల్లా వందశాతం పోలింగ్‌ జరగాలని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని తాలుకా కేంద్రాల్లోనూ అవగాహన కల్పించామన్నారు. ప్రస్తుతం వైద్య విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఆస్పత్రికి వచ్చే రోగులకు కరపత్రాలు అందజేసి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లాలో వందశాతం పోలింగ్‌కు ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. అనంతరం మహిళా సంఘాలకు వందశాతం పోలింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా వేలూరు ఏలగిరి ఆవరణలో మహిళా సంఘాలకు వందశాతం పోలింగ్‌పై ముగ్గుల పోటీలు నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఆస్పత్రి సిబ్బంది, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement