వేలూరు: విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వారికే రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇవ్వాలని తమిళనాడు విద్యుత్ మండలి ఇంజినీరింగ్ విభాగం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంథోని బడవరాజ్ అన్నారు. వేలూరు జిల్లాలోని ఆ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం వేలూరు జోనల్ కార్యదర్శి ఇంజినీర్ తనిగ సెల్వన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గత ఆర్థిక సంవత్సర ఖర్చులు వివరాలు, ప్రణాళికలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలోని సమస్యలను పరిష్కరించడానికి తమ సంఘం ఆలస్యంగా పోరాటాలను ప్రారంభించడంతో వాటిలో విజయం సాధించలేకపోయామన్నారు. విద్యుత్ శాఖలోని ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ రీత్యా పలు సమస్యలు ఉన్నప్పటికీ సెలవు రోజుల్లో కూడా వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం వివిధ సమస్యలపై సమీక్షించారు. సంఘం సంక్షేమ నిధి కార్యదర్శి ఇంజనీర్ సంతోషకుమార్, పరిపాలన కార్యదర్శి రాకేష్‌తోపాటు శాఖా అధ్యక్షుడు ఇంజినీర్ శక్తివేల్, శాఖా కార్యదర్శి వినాయకం, కోశాధికారి మణికండన్, నిర్వాహకులు సుధాకర్, అరుణ్, శరవణన్, తమిళనాడు విద్యత్ మండలి ఇంజినీర్ల సంఘానికి చెందిన సభ్యులు కార్యవర్గ సభ్యులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.


