యాక్షన్‌ సన్నివేశాలు రీషూట్‌ | - | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ సన్నివేశాలు రీషూట్‌

Mar 29 2026 7:14 AM | Updated on Mar 29 2026 7:14 AM

తమిళసినిమా: రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జైలర్‌ –2. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఇందులో నటుడు ఎస్జే సూర్య, సురాజ్‌ వెంజారముడు, రమ్య కృష్ణ, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌, కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి అయినట్లు, జూన్‌ నెలలో తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో జైలర్‌ –2 చిత్రంలోని ఫైట్‌ సన్నివేశాలను రీ షూట్‌ చేస్తున్నట్లు సమాచారం. యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు తెలిసింది. యాక్షన్‌ సన్నివేశాలు ఇంతకు ముందు రజనీకాంత్‌ చిత్రాల్లో చూడనటువంటివిగా జైలర్‌– 2 చిత్రంలో ఉంటాయట. ఇందులోని ఫైట్‌ సన్నివేశాల కోసం రజనీకాంత్‌ చాలా రిస్క్‌ తీసుకుని నటిస్తున్నట్లు, అందుకు చిత్ర యూనిట్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం చిత్రంలో రజనీకాంత్‌, షారూఖ్‌ ఖాన్‌ మధ్య యాక్షన్‌ సన్నివేశాలు ఆసక్తిగా ఉంటాయని సమాచారం. మొత్తం మీద జైలర్‌ –2 చిత్ర సక్సెస్‌ కోసం యూనిట్‌ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement