తిరుత్తణి: తిరుత్తణి గాంధీనగర్‌లో ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ వేడుకలు గురువారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తిరుత్తణి, గాంధీనగర్‌లోని ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ వేడుకలను గురువారం ధ్వజారోహణం నిర్వహించి వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్రౌపదీదేవికి విశేష పుష్ఫాలంకరణ చేసి కొలువుదీర్చారు. వేకువజాము ఐదు గంటలకు ధ్వజస్తంభానికి విశేష పూజలు చేసి వేడుకలకు ధ్వజారోహణంతో శ్రీకారం చుట్టారు. 18 రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలను పురస్కరించుకుని ఆలయ పరిసర ప్రాంతాలు విద్యుద్దీపాలతో అలంకరించారు. రోజూ పగటి సమయాల్లో మహాభారత ఉపన్యాసాలు, రాత్రి వేళల్లో వీధి నాటకాలు ప్రదర్శిస్తారు. ఏప్రిల్ 12న అగ్నిగుండ వేడుకగా నిర్వహించనున్నారు. ఉత్సవ వేడుకలు ప్రారంభంతో భక్తులు కంకణాలు ధరించి దీక్షలు ప్రారంభించారు.
ధ్వజారోహణం
అలంకరణలో ద్రౌపదీదేవి


