సాక్షి, చైన్నె: ‘షఫ్లింగ్ సూట్‌కే సెస్’ నేతృత్వంలో చైన్నె వేదికగా మార్చి 28, 29 తేదీల్లో అమేథిస్ట్‌లో ప్రత్యేక ప్రదర్శన, ఫ్యాషన్ షో నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. స్వదేశీ బ్రాండ్లు, పర్యావరణహిత ఫ్యాషన్‌కు చిరునామాగా నిలిచే మల్టీ–డిజైనర్ ప్లాట్‌ఫారమ్ ‘ష ఫ్లింగ్ సూట్‌కేసెస్’ తన విలక్షణమైన పాప్–అప్ ప్రద ర్శనకు ఈ ఏడాది చైన్నెను వేదికగా ఎంపిక చేసింది. రాయపేటలోని ’అమేథిస్ట్’వేదికగా ఈ ఫ్యాషన్ వేడుక జరగనుంది. ఈ రెండ్రోజుల ప్రదర్శనలో భాగంగా ప్ర త్యేకంగా ఎంపిక చేసిన బ్రాండ్లు తమ ‘స్ప్రింగ్,సమ్మ ర్’ కలెక్షన్లను ప్రదర్శించనున్నారు. భారతీయ కళాత్మకతకు, ఆధునిక అభిరుచులకు అద్దం పట్టేలా ఈ ఎడిషన్‌ను రూపొందించారు. కొత్త డిజైనర్లను ప్రోత్సహిస్తూ నే, వినియోగదారులకు నాణ్యమైన, విభిన్నమైన ఫ్యా షన్ ఉత్పత్తులను ఒకే చోట అందించడం తమ ఉద్దేశంగా ప్రకటించారు. చైన్నె నగరానికి కళలు, హస్తకళల మక్కువను చాటే విధంగా సమకాలీన శైలిలో ఉండే లా ఈ ఎడిషన్‌ను ప్లాన్ చేశాం’ అని తెలిపారు. ఉద యం 11:00 గంటల నుండి రాత్రి 7.00 గంటల వర కు జరిగే ఈ ప్రదర్శనకు ప్రవేశం అందరికీ ఉచితం అని ప్రకటించారు. ఇది భారతదేశంలోని స్వదేశీ బ్రాండ్లను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే ఒక వేదిక అని, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉనికిని చాటుకుంటూ, కళాకారుల నైపుణ్యాన్ని పర్యావరణహిత ఫ్యాషన్‌ను ఇది ప్రోత్సహిస్తోందని ప్రకటించారు. ఈ వేడుకకు ప్రఖ్యాత ఫ్యాషన్ మోడల్స్ తరలి రానున్నట్టు వివరించారు.


