పిల్లల్లో సృజనాత్మకతకు ‘క్రేకిడ్‌’ బోర్డ్‌ గేమ్స్‌ | - | Sakshi
Sakshi News home page

పిల్లల్లో సృజనాత్మకతకు ‘క్రేకిడ్‌’ బోర్డ్‌ గేమ్స్‌

Mar 27 2026 8:55 AM | Updated on Mar 27 2026 8:55 AM

సాక్షి, చైన్నె: పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, స్వతంత్ర ఆలోచనా ధోరణిని పెంపొందించే లక్ష్యంతో చైన్నెకి చెందిన ’క్రేకిడ్‌’ సంస్థ విజువల్‌ ఆర్ట్స్‌ ఆధారిత సరికొత్త బోర్డ్‌ గేమ్స్‌ , యాక్టివిటీ కిట్‌లను ఆవిష్కరించింది. ఇది కేవలం సూచనలను అనుసరించడమే కాకుండా, సొంతంగా కొత్త విషయాలను కనిపెట్టేలా రూపొందించారు. స్టికూ ప్రో – ప్రో మాక్స్‌ పేరిట 3 నుండి 7 ఏళ్ల పిల్లల కోసం రూపొందించిన ఈ కిట్స్‌ ద్వారా స్టిక్కర్లను ఉపయోగిస్తూ కథలను, దృశ్యాలను సృష్టించ వచ్చని, ఇది పిల్లల్లో ఊహాశక్తిని పెంచుతుందని ఆ సంస్థ డైరెక్టర్లు అమర్‌ నాథ్‌ అళగప్పన్‌, నరేంద్రనాథ్‌ వివరించారు. పెర్‌స్కెచ్‌ పేరిట 10 ఏళ్లు పైబడిన వారి కోసం ఉద్దేశించిన కిట్‌ ద్వారా భారతీయ వీధులు, ప్రదేశాలను పర్ఫెక్ట్‌గా డ్రాయింగ్‌ పద్ధతిలో గీయడం నేర్చుకోవచ్చు అని వివరంచారు. క్లేడోజ్‌ పేరిట మట్టితో బొమ్మలు చేస్తూ కథలు అల్లే కిట్‌ 6 ఏళ్ల పైబడిన పిల్లలకు ఎంతో ఉల్లాసాన్నిస్తుందన్నారు. పిల్లలు కేవలం సూచనలను పాటించడం దగ్గర ఆగిపోకూడదని, వారి సొంత ఆలోచనలకు రూపం ఇచ్చినప్పుడే అసలైన నేర్చుకోవడం మొదలవుతుందన్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే అనుభవాలను తాము రూపొందిస్తున్నామన్నారు. సృజనాత్మకతను ఒక ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం అని, రాబోయే తరానికి అవసరమైన వినూత్న ఉత్పత్తులను అందిస్తూ ఈ విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందాలనుకుంటున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement