ప్రేమించిన అమ్మాయి కోసం.. | - | Sakshi
Sakshi News home page

ప్రేమించిన అమ్మాయి కోసం..

Mar 27 2026 8:55 AM | Updated on Mar 27 2026 8:55 AM

తమిళసినిమా: యుక్త వయసు వచ్చిన తరువాత యువతీయువకులు తిరిగేది ప్రేమ గురించే. అలా ఒక యువకుడు ప్రేమ కోసం ఎన్నో పాట్లు పడుతుంటాడు. నచ్చిన ప్రతి యువతి వెంట పడుతూ ప్రేమ కోసం తపిస్తుంటారు. అయితే అతని ప్రేమను చాలా మంది తిరస్కరిస్తారు. అలాంటి తరుణంలో ఓ యువతి అతన్ని ప్రేమిస్తుంది.అంతే కాదు అతనిలో పలు మార్పులు తీసుకొస్తుంది. పెద్ద బిజినెస్‌ మ్యాన్‌ కూతురైన ఆమె ప్రేమకు ఆయన సమ్మతిస్తాడు. అయితే ఈ ప్రేమికుల ప్రేమ సక్సెస్‌ అయ్యిందా? లేదా? అనే పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం హ్యాపీ రాజ్‌. ప్రేమకు ఆస్తి అంతస్తులు ముఖ్యం కాదు, మంచితనం, మానవత్వం ముఖ్యం అని చెప్పే మంచి సందేశంతో కూడిన కుటుంబ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన చిత్రం ఇది. నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం హ్యాపీ రాజ్‌. నటి శ్రీ గౌరీ ప్రియ నాయకిగా ఇందులో నటుడు అబ్బాస్‌, జార్జ్‌ మరియన్‌, గీత కై లాసం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బియాండ్‌ పిక్చర్స్‌ పతాకంపై జయవర్ద నిర్మించిన ఈ చిత్రానికి జయకాంత్‌ సురేష్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. మరియ రాజా ఎలన్‌ చెళియన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు.జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement