● ప్రధాన కార్యదర్శి సస్పెన్షన్
సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్‌లో టీవీకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. అదే సమయంలో తమిళనాడు కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి డి సెల్వంను సస్పెండ్‌చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు కేటాయించినట్టుగా అనేక మంది నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడులో కాంగ్రెస్‌ను నమ్ముకుంటే రాజకీయం చేయలేమంటూ అనేక మంది నేతలు పార్టీ అధిష్టానం పెద్దల వద్ద ఆవేదనను వ్యక్తం చేసినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈపరిస్థితులలో టీవీకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున బుధవారం చైన్నెలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి.
క్యూలో వంద మంది నేతలు
ఆధవ్ అర్జన మాట్లాడుతూ, కాంగ్రెస్ గుడారం ఖాళీ కానున్నట్టు వివరించారు. డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటుపై అనేక మంది నేతలు అసంతృప్తితో ఉన్నారని, సుమారు వంద మంది నేతలు టీవీకేలోచేరడానికి క్యూలో ఉన్నట్టు ప్రకటించారు. పార్టీఅధినేత విజయ్‌ను కలిసేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నారని, ఒకటి రెండు రోజులలో కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులు వంద మంది టీవీకేలో చేరబోతున్నారని చేసిన వ్యాఖ్యలో చర్చకు దారి తీశాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డి సెల్వంను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయడం గమనార్హం. ఆ వంద మంది నేతలు ఎవరో అన్న చర్చ ఊపందుకోవడంతో కాంగ్రెస్‌లో ప్రకంపన బయలు దేరినట్లయ్యింది. అదే సమయంలో ఆధవ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఖండించారు. తమ అధినేతలు మల్లికార్జున కార్గే, రాహుల్ గాంధి మార్గదర్శకంలో ఇక్కడ నేతలు పార్టీ కోసం శ్రమిస్తారని వ్యాఖ్యలు చేశారు.
తిరుత్తణి: కంచిలో పట్టు చీరలు కొనేందుకు వెళుతున్న వారి నుంచి రూ. 2.50 లక్షలను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం ఉదయం స్వాదీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నియమావళి నిబంధనలు అమలు చేసే విధంగా అధికారులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుత్తణి సమీపం అరక్కోణం రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారును తనిఖీ చేశారు. సరైన ఆధారలు లేని రూ.2.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నగదును ఆర్డీఓ కార్యాలయంలో అప్పగించారు. విచారణలో పుత్తూరుకు చెందిన పూర్ణిమ కుటుంబ వివాహం కోసం కంచిలో పట్టు చీరలు కొనుగోలుకు వెళ్లుతున్నట్లు తెలిపారు.


