క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Mar 26 2026 11:40 AM | Updated on Mar 26 2026 11:40 AM

●పారిపోయిన వధూవరులు, బంధువులు

కారు ఢీకొనడంతో యూకేజీ విద్యార్థిని మృతి

అన్నానగర్‌: తెన్‌కాశీ జిల్లాలోని పులియంగుడి సమీపంలో ఉన్న నెర్కట్టుం సేవల్‌ గ్రామానికి చెందిన మారిసామి. ఇతని భార్య పేరు వేల్‌ మయిల్‌. వీరి ఏకై క కుమార్తె శివయళిని (4). ఈమె పులియంగుడి ప్రాంతంలోని ఒక ఉన్నత మాధ్యమిక పాఠశాలలో యూకేజీ చదువుతోంది. మంగళవారం సాయంత్రం, శివయళిని పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్లడానికి పాఠశాల ఆవరణలో వేచి ఉంది. ఆ సమయంలో, ఒక కారు వేగంగా పాఠశాల ఆవరణలోకి వచ్చింది. ఈ క్రమంలో శివయళినిని ఢీ కొట్టింది. దీంతో ఆ విద్యార్థిని సంఘటన స్థలం లోనే మరణించింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

భారీ బందోబస్తు నడుమ ఈవీఎంల తరలింపు

తిరువళ్లూరు: జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఈవీఎంలను భారీ పోలీసు బందోబస్తు నడుమ బుధవారం తరలించారు.ఈ పనులను కలెక్టర్‌ ప్రతాప్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ తిరువళ్లూరులోని గోదాములో 8,663 బ్యాలెట్‌ యూనిట్‌లు, 6,240 కంట్రోల్‌ యూనిట్‌, 5,968 వీవీప్యాట్‌లతో సహా 20,871 మిషన్‌లు వున్నాయన్నారు. వీటిలో లాటరీ విధానం ద్వారా 4,821 బ్యాలెట్‌ యూనిట్‌, 4,821 కంట్రోల్‌ యూనిట్‌, 5,223 వీవీప్యాట్‌లతో సహా 14,865 మిషన్‌లను ఎంపిక చేసి వాటిని ఆయా నియోజకవర్గాల్లో భారీ పోలీసు బందోబస్తు నడుమ భద్రపరిచినట్టు తెలిపారు. మిగిలిన 3,842 బ్యాలెట్‌ యూనిట్‌, 1,419 కంట్రోల్‌ యూనిట్‌, 745 వీవీప్యాట్‌లతో సహా 6,006 మిషన్‌లను గోడౌన్‌లో వుంచామన్నారు.

పీఎంకే అభ్యుర్థుల

జాబితా విడుదల

సాక్షి, చైన్నె : పీఎంకే తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. అన్బుమణి నేతృత్వంలో పీఎంకే అన్నాడీఎంకే కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. అన్బుమణికి అన్నాడీఎంకే 18 స్థానాలను కేటాయించింది. తొలి జాబితాను అన్బుమణి విడుదల చేశారు. ఇందులో పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎ. గణేష్‌ కుమార్‌ సెంజి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అంబత్తూరులో మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఎన్‌. శేఖర్‌ బరిలోకి దిగుతున్నారు.కీల్‌ వేలూరులో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్‌. వడివేల్‌ రావణన్‌ పోటీచేస్తున్నారు.

పెళ్లి మండపంలో బాంబు బెదిరింపు

అన్నానగర్‌: దిండుక్కల్‌–తిరుచ్చి బైపాస్‌ రోడ్డులో ఒక ప్రసిద్ధ వివాహ మండపం ఉంది. బుధవారం ఈ మండపంలో ఒక వివాహం జరగాల్సి ఉంది. బుధవారం ఉదయం, వరుడిని ఆహ్వానించడంతో పాటూ ఇతర కార్యక్రమాలు జరిగాయి, అనంతరం వధూవరులకు పూలమాలలు వేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో, పెళ్లి మండపంలో బాంబు పెట్టారనే వార్త అకస్మాత్తుగా వ్యాపించింది. దీంతో పెళ్లికి వచ్చిన అతిథులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం దాడికొంబు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు బాంబు నిపుణులతో సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులందరూ ప్రాణాలతో బయటపడాలనే ఆశతో హాలులోంచి బయటకు పరుగులు తీశారు. అంతేకాకుండా, వధూవరులను వారి బంధువులు తాళీ కట్టకుండానే బయటకు తీసుకువచ్చారు. అనంతరం తనిఖీలు చేశారు. బాంబు బూచీ ఒత్తిటే అని తేల్చారు.

ఎంఎస్‌ఎంఈలకు తోడ్పాటుగా వేదిక

సాక్షి, చైన్నె : ఎంఎస్‌ఎంఈలతో పాటుగా పెద్ద సంస్థలు తమ ఆర్థిక సంవత్సరం ముగింపు కొనుగోళ్లను సులభతరం చేస్తూ ఒక గొప్ప వేదికను ఏర్పాటు చేశామని అమెజాన్‌ బిజినెస్‌ ప్రకటించింది. ఎండ్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఇయర్‌ సేల్‌ 2026 ప్రారంభిస్తూ బుధవారం నిర్వాహకులు వివరాలను వెల్లడించారు. ఈ సేల్‌ ఒక గొప్ప వేదికగా నిలవనుందన్నారు. ఐటీ పరికరాలు, ఆఫీస్‌ ఫర్నిచర్‌ , ఇండస్ట్రియల్‌ టూల్స్‌ వంటి వివిధ విభాగాలలో ఈ సేల్‌ ప్రత్యేక ఆఫర్లను అందిస్తుందన్నారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, ఇతర ఐటీ యాక్సెసరీలపై 50 శాతం వరకు డిస్కౌంట్‌, ఆఫీస్‌ ఫర్నిచర్‌, స్టేషనరీ రోజువారీ అవసరాలకు ఉపయోగపడే వస్తువులపై 70 శాతం వరకు తగ్గింపు ఈ వేదిక కల్పిస్తుందని వివరించారు. 2025 సంవత్సరంలో అమెజాన్‌ బిజినెస్‌ ద్వారా రూ. 2 వేల కోట్ల వరకు వర్తకం పరంగా ఆదా కల్పించామన్నారు. గుర్తింపు పొందిన సంస్థలు కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఉచితంగా నమోదు చేసుకుని ఈ ప్రయోజనాలను పొందవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement