తమిళసినిమా: యువ నటుడు రియోరాజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారనే చెప్పాలి. ఈయన కథానాయకుడిగా నటించిన వైవిధ్య భరిత ప్రేమ కథాచిత్రం జో చిత్రం 2023లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.అఝదులో నటి మాళవిక మనోజ్ నాయకిగా నటించారు. హరిహరన్ రామ్ దర్శకత్వం వహించారు.ఆ తరువాత మరోసారి రియోరాజ్,మాళవిక మనోజ్ జంటగా నటించిన చిత్రం ఆన్ పావమ్.ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా తాజాగా రామ్ ఇన్ లీల అనే చిత్రంలో రియో రాజ్ హీరోగా నటిస్తున్నారు.ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో నూతన చిత్రానికి కమిట్ అయ్యారు. ఈ చిత్రానికి మడ్డీ టైటిల్ ను ఖరారు చేసారు. ఇందులో మలయాళ కుట్టి సానియా అయ్యప్పన్ హిరోయిన్ గా నటించనున్నారు. ఈమె ఇంతకు ముందు నటుడు విక్రమ్ ప్రభు హీరోగా నటించిన ఇరుగపట్రు అనే చిత్రం ద్వారా కోలీవుడ్లోకి అడుగు పెట్టారు.ఇక్కడ ఈ అమ్మడు నటిస్తున్న రెండవ చిత్రం మిడ్డీ. కాగా ఈ చిత్రం ద్వారా కార్తీకేయన్.బీకే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళైఅరసు నిర్మించిన ఈ చిత్రానికి దిబు నినన్ థామస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది రొమాంటిక్ కామెడీ కథా చిత్రంగా ఉంటుందని నటుడు రియో రాజ్ తన ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.


