తల్లి, బిడ్డకు ప్రాణ రక్షణ | - | Sakshi
Sakshi News home page

తల్లి, బిడ్డకు ప్రాణ రక్షణ

Mar 26 2026 11:40 AM | Updated on Mar 26 2026 11:40 AM

సాక్షి, చైన్నె: వైద్య చరిత్రలో అత్యంత అరుదుగా నిలిచే ఒక క్లిష్టమైన శస్త్రచికిత్సను చైన్నెలోని ఎస్‌ఆర్‌ఎం గ్లోబల్‌ హాస్పిటల్స్‌ వైద్య బృందం విజయ వంతం చేవారు.32 వారాల గర్భిణికి ఎదురైన వెన్నెముక సమస్యను, ప్రసవ సమస్యను ఏకకాలంలో పరిష్కరించారు. 32 ఏళ్ల గర్భిణి తీవ్రమైన వెన్నునొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఆమెకు శ్రీకౌడా ఈక్వినా సిండ్రోమ్‌శ్రీ అనే అరుదైన నరాల వ్యాధి సోకినట్టు గుర్తించారు. వెన్నెముకలోని ఎల్‌4–ఎల్‌5 ప్రాంతంలో డిస్క్‌ బయటకు రావడం వలన నరాలు తీవ్రంగా ప్రభావానికి గురైనట్టు తేల్చారు. దీంతో నడవ లేని పరిస్థితి, మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం జరిగింది. దీంతో కొన్ని గంటల్లోనే చికిత్స అందించకపోతే ఆమె శాశ్వతంగా పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉందని తేల్చారు. రోగి సుమారు 130 కిలోల బరువు ఉండటం, మధుమేహం, రక్త పోటు,థైరాయిడ్‌ సమస్యలుఉండటంతో చికిత్స సంక్లిష్టంగా మారింది. ఆమెకు యాంటీ ఫాస్ఫోలిపిడ్‌ యాంటీబాడీ ) సిండ్రోమ్‌ కూడా ఉండటంతో ఒకేసారి రెండు సర్జరీలు నిర్వహించాల్సిన అవవ్యం ఏర్పడింది. సిజేరియన్‌తో బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లికి వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించే శ్రీడికంప్రెషన్‌శ్రీ సర్జరీని నిర్వహించారు. వెన్నెముక నిపుణులు డాక్టర్‌ యోగేష్‌ కుమర్‌, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఆర్‌.కె. విద్యాలక్ష్మి, హెమటాలజిస్ట్‌ డాక్టర్‌ అభినయ, నియోనాటాలజిస్ట్‌ డాక్టర్‌ అశోక్‌, అనస్థీషియా నిపుణులు డాక్టర్‌ షణ్మిత ఈ శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. సిజేరియన్‌ సమయంలో తగిన జాగ్రత్తలు సవాలుగా మారయని, వెను వెంటనే మరో శస్త్ర చికిత్స మరింత సంక్లిష్టమైనా, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండటం ఆనందంగా ఉందని డాక్టర్‌ యోగేష్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement