చైన్నెలో ‘వ్యాగ్‌ ఎన్‌ డైన్‌’ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో ‘వ్యాగ్‌ ఎన్‌ డైన్‌’ ఆవిష్కరణ

Mar 26 2026 11:40 AM | Updated on Mar 26 2026 11:40 AM

● పెంపుడు జంతువుల కోసం హ్యూమన్‌ గ్రేడ్‌ క్లౌడ్‌ కిచెన్‌

సాక్షి, చైన్నె: పెంపుడు జంతువుల పోషణలో సరికొత్త వేదికను చైన్నెలో ఏర్పాటు చేశారు. శునకాల కోసం తాజాగా వండిన, నాణ్యమైన ఆహారాన్ని అందించే వ్యాగ్‌ ఎన్‌ డైన్‌శ్రీ క్లౌడ్‌ కిచెన్‌ సేవలు చైన్నెలోని తాజ్‌ కన్నెమరా హోటల్‌లో ఘనంగా ప్రారంభించారు. సాధారణంగా పెంపుడు జంతువులకు ఇచ్చే ప్రాసెస్డ్‌ ఫుడ్‌ (డ్రై ఫుడ్‌) కాకుండా, మనుషులు తినేటటువంటి నాణ్యమైన చికెన్‌, శుద్ధి చేసిన నీరు, సహజమైన పదార్థాలతో ఈ ఆహారాన్ని తయారు చేస్తారు. దీనినే శ్రీహ్యూమన్‌ గ్రేడ్‌శ్రీ మీల్స్‌ అని పిలుస్తారు. ప్రతిరోజూ తాజాగా వండిన ఆహారాన్ని నేరుగా కస్టమర్ల ఇంటికే డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకన్నారు. ఇందులో ఎలాంటి నిల్వ ఉంచే రసాయనాలు వాడరని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ చెప్‌, , గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ గ్రహీత పద్మశ్రీ దాము పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తినే ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో, పెంపుడు జంతువుల విషయంలో కూడా అంతే శ్రద్ధ వహించాలని సూచించారు. ఆ లోటును భర్తీ చేయడానికే వ్యాగ్‌ ఎన్‌ డైన్‌ ప్రారంభమైందన్నారు. వ్యాగ్‌ ఎన్‌ డైన్‌ వ్యవస్థాపకుడు మణివన్నన్‌ మాట్లాడుతూ.. పెంపుడు జంతువులకు కేవలం ఆహారం ఇవ్వడమే కాకుండా, వాటికి సరైన పోషణ అందించడం లక్ష్యంగా పేర్కొన్నారు. చైన్నె వంటి నగరాల్లో నాణ్యమైన పెట్‌ ఫుడ్‌ కోసం చూస్తున్న యజమానులకు మా క్లౌడ్‌ కిచెన్‌ ఒక మంచి ప్రత్యామ్నాయం అవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement