తమిళసినిమా: కాళిదాసు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ఇంక్రిడబుల్ ప్రొడక్షన్‌న్స్ సంస్థ నిర్మించిన తాజా చిత్రం గేమ్ ప్లే. నాళైయ ఇయక్కునార్ సీజన్ 4 నిర్వాహకుడు శివనేశన్ దర్శకుడి మారి తెరకెక్కించిన ఈ చిత్రంలో నటుడు. కిశోర్, హార్ట్ బీట్ వెబ్ సిరీస్ ఫేమ్ చారుకేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో నటి షాలీ నివేకాస్, వినోద్ కిషన్, శార్వి ముఖ్యపాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని, సురేశ్ బాలా చాయాగ్రహణం అందించారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజత విడుదల చేసిన యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు తెలుపుతూ ఈ చిత్రానికి కథే హీరో అని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని చెప్పారు. ఇంతవరకు తమిళంలో చూడని కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అన్నారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని, త్వరలోనే చిత్ర టీజర్, ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
తమిళసినిమా: నటి తాప్సి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ ఉత్తరాది భామ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కథానాయికగా నటిస్తూ టాప్ నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా హిందీలో పలు ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ ఏదో ఒక సంచలన వార్తతో సామాజిక మాధ్యమాలలో కనిపిస్తూనే ఉన్నారు. కథానాయికలకు ప్రాధాన్యత కలిగిన చిత్రాలు నటించడానికి పలువురు హీరోలు సంశయిస్తున్నారని అన్నారు. ము ఖ్యంగా తనకు జరిగిన ఒక విషయం గుర్తు చేస్తూ తనకు ద్విపాత్రాభినయం చేసే అవకాశం వచ్చిందని, ఆ చిత్రంలో హీరోగా నటించడానికి ఒక ప్రము ఖ నటుడిని నిర్మాత సంప్రదించారని, అయితే కథ విన్న ఆయన ఇందులో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉందని చెప్పి నటించడానికి నిరాకరించారని చెప్పారు. ఈ విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయానన్నారు. ఈ అమ్మడు తాను నటించిన చిత్రాన్ని ఏ హీరో నిరాకరించారు అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పు డు సామాజిక మాధ్యమాల్లో వైర ల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ 38 ఏళ్ల భామ హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.
వినోద్ దర్శకత్వంలో సూర్య?
హీరోయిన్‌కు ప్రాధాన్యత
ఉందంటూ..
తమిళసినిమా: ఒక రేర్ కాంబినేషన్‌కు శ్రీకారం పడనుందా? అంటే అందుకు అవుననే బదులే సినీ వర్గాల నుంచి వస్తోంది. క్రేజీ స్టార్ హీరో సూర్య. వైవిధ్యానికి కేరాఫ్ ఈయన చిత్రాలు. తాజాగా ఈయన విశ్వనాథ్ అండ్ సన్‌న్స్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం కానున్నారు. ఇకపొతే సూర్య హీరోగా నటించిన కరుప్పు చిత్రం భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నిర్మాతల వర్గం ఇటీవల ప్రకటించారు. దీని తరువాత మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టెయినర్ కథా చిత్రం జూలైలో తెరపైకి రానుంది. చాలా కాలంగా ట్రెండింగ్‌లో ఉన్న వాడివాసల్ చిత్రంలో నటించడానికి సూర్య సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్.వినోద్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. తక్కువ చిత్రాలు చేస్తూ భారీ విజయాలను సాధిస్తున్న దర్శకుడు ఈయన. వినోద్ తాజాగా విజయ్ హీరోగా జననాయకన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. తర్వాత సూర్య హీరోగా చిత్రం చేయడానికి కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వినోద్ ఇంతకుముందు కార్తీ హీరోగా నటించిన ధీరన్ అధికారం ఒండ్రు చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. తాజాగా సూర్య హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారన్న వార్త విశేషాల్ని సంతరించుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.


