క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Mar 21 2026 5:18 AM | Updated on Mar 21 2026 5:18 AM

నిబంధనలు ఉల్లఘించి

క్రీడా పరికరాల పంపిణీ

–మేయర్‌ సహా ముగ్గురిపై కేసు

వేలూరు: వేలూరు కలెక్టరేట్‌ సమీపంలోని అమ్మ క్యాంటిన్‌ వెనుక వైపున డీఎంకే ఆధ్వర్యంలో వేలూరు కార్పొరేషన్‌ మేయర్‌ సుజాత యువకులకు క్రీడా పరికరాలు అందజేయనున్నట్లు సమాచారం వచ్చింది. విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలకు చెందిన ప్రతినిధులు క్రీడా పరికరాలు అందజేసే ప్రాంతాలకు వెళ్లారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ఉన్నందున క్రీడాపరికరాలు అందజేయరాదని తెలిపారు. వీటిపై వేలూరు ఎన్నికల అధికారి సెంథిల్‌కుమార్‌ వద్ద ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల ప్రత్యేక స్క్వాడ్‌ అధికారులు అక్కడకు చేరుకొని క్రీడాపరికరాలు అందజేయరాదని చెప్పడంతో వెంటనే మేయర్‌ సుజాత, కార్పొరేటర్‌ సతీష్‌కుమార్‌ అక్కడ నుంచి కారు ఆపకుండా వెళ్లిపోయారు. వీటిపై అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శి ఎస్‌ఆర్‌కే అప్పు వేలూరు జిల్లా ఎన్నికల అధికారి సుబ్బలక్ష్మి వద్ద ఫిర్యాదు చేశారు. వేలూరు ఎన్నికల అధికారి సత్‌వచ్చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మేయర్‌ కారును స్వాధీనం చేసుకొ ని మేయర్‌ సుజాత, కార్పొరేషన్‌ 27వ వార్డు కార్పొరేటర్‌ సతీష్‌కుమార్‌, కారు డ్రైవర్‌ గోపీలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

బాల్కనీ కూలి మహిళ మృతి

అన్నానగర్‌: బాల్కనీ కూలి ఓ మహిళ దుర్మరణం పాలైంది. మరో మహిళ గాయపడింది. చైన్నె, వడపళని, అలగిరినగర్‌, 3వ వీధికి చెందిన ఉమ (51). ఈమెకి సొంతమైన పాత ఇంటి బాల్కనీ దెబ్బతినడంతో దాని మరమ్మతు పనులు జరుగుతున్నాయి. గురువారం కల్లక్కురిచికి చెందిన మలర్కోడి (41) అనే మహిళ ఈ నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంది. ఆ సమయంలో ఉమ ఇంటి మొదటి అంతస్తులోని బాల్కనీలో వెళుతోంది. ఆసమయంలో అకస్మాత్తుగా బాల్కనీ కూలిపోయింది. ఆ బాల్కనీ శిథిలాలు, కింద నిలబడి ఉన్న మలర్కోడిపై పడ్డాయి. ఇనుప కడ్డీ ఆమె వీపులోకి గుచ్చుకోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను రక్షించి కిల్పాక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె మరణించినట్లు తెలిపారు. గాయపడిన ఉమ పోరూరులోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వడపళని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పుళల్‌ జైలులో విదేశీ ఖైదీ

తిరువొత్తియూరు: పుళల్‌ జైలులో విదేశీ ఖైదీ మృతిచెందాడు. పుళల్‌ జైలులో 4 వేలకు పైగా ఖైదీలు ఉన్నారు. ఇందులో వివిధ నేరాలకు పాల్పడిన విదేశీ ఖైదీలు కూడా ఉన్నారు. పోర్చుగల్‌ దేశానికి చెందిన డొమింగోస్‌ మెండెస్‌ అఫోన్సో (60) అనే వ్యక్తి 2023వ సంవత్సరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అరెస్టు అయి పుళల్‌ జైలులో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతనికి కాలేయ సంబంధిత వ్యాధి ఏర్పడింది. అతన్ని గత నెల చైన్నె స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ అతను శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీని గురించి జైలు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుళల్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

600 తుపాకులు స్వాధీనం

అన్నానగర్‌: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, ఏప్రిల్‌ 23న జరగనున్న దృష్ట్యా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో, భద్రతా కారణాల దష్ట్యా కోయంబత్తూరు నగరంలో లైసెన్స్‌ ఉన్న తుపాకులను కలి గి ఉన్న వారు వాటిని పోలీస్‌ స్టేషన్లలో అప్పగించాలని కమిషనర్‌ కన్నన్‌ ఆదేశించారు. దీని ప్రకా రం కోయంబత్తూరులోని 900 లైసెన్స్‌ పొందిన తుపాకుల్లో ఇప్పటివరకు 600 మంది తుపాకులను అప్పగించారని. మిగిలిన 300ల మంది రాబోయే రెండు రోజుల్లో తమ తుపాకులను అప్పగించాలని పోలీసులు ఆదేశించారు.

క్వారీ అక్రమాలపై దర్యాప్తు

అన్నానగర్‌: కేరళకు తమళనాడు నుంచి అక్రమంగా క్వారీల నుంచి తరలిస్తున్న రాళ్లు, ఇసుక ఇతర వాటిపై దర్యాప్తు జరపాలని మదురై హైకోర్టు ఆదేశించింది. కన్యాకుమారి జిల్లాలోని తిరువట్టార్‌ తాలూకా, పుత్తన్‌కడై ప్రాంతానికి చెందిన సురేష్‌, మదురై హైకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో ఈ విధంగా పేర్కొన్నారు. నైల్లె జిల్లాలోని రాధాపురం, ఇరుక్కన్‌ దురై ప్రాంతాలలో రాతి క్వారీలు, క్రషర్లు పనిచేస్తున్నాయి. అక్కడి నుంచి ఖనిజ వనరుల రవాణాలో వివిధ అవకతవకలు జరుగుతున్నాయి. అంటే, ప్రతిరోజూ అనుమతి లేకుండా క్వారీ నుంచి రాళ్లను కేరళకు తరలిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో 5 లక్ష ల టన్నుల రాళ్లను అక్రమంగా తవ్వి, కేరళకు స్మగ్లింగ్‌ చేయడానికి నిల్వ ఉంచారు. దీని విలు వ రూ. 200 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. రాళ్లను అక్రమంగా తవ్వడాన్ని, అనుమతి లేకుండా వాటిని రవాణా చేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వు జారీ చేయాలని కోర్టును కోరాడు. ఈ కేసు జస్టిస్‌ సతీష్‌ కుమార్‌, జ్యోతిరామన్‌ ముందు విచారణకు వచ్చింది. ఆ సమయంలో, పిటిషనర్‌ తరఫున హాజరైన న్యాయ వాది వివేక్‌ కుమార్‌, క్వారీ నుంచి రాళ్ల ను తమిళనాడులోని అనేక ప్రాంతాలకు రవాణా చేసి, అనుమతి పొందిన తర్వాత వాటిని కేరళకు అక్రమంగా తరలించడం చట్టవిరుద్ధమ ని పేర్కొన్నారు. అయితే, నిర్దేశిత ప్రాంతంలో ప్రస్తుతం ఎలాంటి క్వారీయింగ్‌ పనులు జరగడం లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో విచారణకు ఆదేశిస్తూ తదుపరి విచారణను 26వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement