ఘనంగా వార్షిక దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వార్షిక దినోత్సవం

Mar 21 2026 5:18 AM | Updated on Mar 21 2026 5:18 AM

వేలూరు: రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపంలోని రత్నగిరి బాలమురుగన్‌ సిద్ధర్‌ స్వామీజి అధ్యాత్మిక జ్ఞానోదయ వార్షిక దినోత్సవాన్ని పురష్కరించుకొని ఆలయంలోని స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభి షేకాలు, పుష్పాలంకరణలు, దీపారాధన పూజలు జరిగాయి. అనంతరం ఆలయంలో ముమ్మూర్తిలైన పవిత్ర మూర్తులకు ప్రత్యేక అభిషేకం చేసి దీపారాధన చేశారు. ఈ సందర్భంగా నాదస్వరం బృందం ప్రదర్శించిన పవిత్రమైన ఊరేగింపు, సంగీత సంగమం, నాద సంగమం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం ఆలయంలో భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులతో కలసి బోజనం చేశారు. మైలం బొమ్మాపురం ఆధీనం 20వ గురు సన్నిదానంద శివజ్ఞాన బాలాస్వామీజి, గౌమార మరబు శివరై ఆధీనం గురుమహా సన్నిధానం శ్రీ కుమర గురుబర స్వామీజి, కలవై సచ్చిదానం స్వామిజీలు పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయంలోని స్వామి వారిని దర్శించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement