తిరుత్తణిలో సీఐఎస్‌ఎఫ్‌ కవాతు | - | Sakshi
Sakshi News home page

తిరుత్తణిలో సీఐఎస్‌ఎఫ్‌ కవాతు

Mar 21 2026 5:18 AM | Updated on Mar 21 2026 5:18 AM

తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో నిసక్షంగా ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల భరోసా కల్పించే విధంగా తిరుత్తణిలో శుక్రవారం సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు కవాతు నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీకి ఏప్రిల్‌ 23న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో తనిఖీలు ముమ్మరంగా నిర్వహించి ఓటర్లను ప్రలోభాలాకు గురికాకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా తిరుత్తణి నియోజకవర్గంలోని 337 పోలింగ్‌ కేంద్రాల్లో 2.65 లక్షల మంది ఓటర్ల తమ ఓటు హక్కు వినియోగించుకోనున్న క్రమంలో వంద శాతం ఓటింగ్‌కు అవగాహనతో పాటు ఓటర్లకు భరోసా కల్పించే విధంగా కవాతు నిర్వహించారు. చిత్తూరు రోడ్డు నుంచి ప్రారంభమైన కవాతును ఏఎస్పీ శుభమ్‌ దిమాన్‌ ప్రారంభించారు. ఇందులో 50 మంది సీఐఎస్‌ఎప్‌ జవాన్లతోపాటు పోలీసులు పాల్గొని పట్టణంలోని ప్రదాన వీధుల్లో మార్చింగ్‌ నిర్వహించి ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల ఈసందర్భంగా అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement