వీధి శునకాలకు కుటుంబ నియంత్రణ
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా వున్న వీధి శునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేసి వాటిని పర్యవేక్షించనున్నట్టు పశసంవర్థఽకశాఖ జాయింట్ డైరెక్టర్ జయంతి తెలిపారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వున్న వీధి శునకాలకు కుటుంబ నియంత్రణ అపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే మొదట దశలో శునకాల లెక్కింపు ప్రక్రియను నెల రోజుల నుంచి చేశారు. ఈ లెక్కల ప్రకారం 21, 700 వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం తిరువళ్లూరు డివిజన్‌లోని తిరుమళిసై, తిరుత్తణి డివిజన్‌లోని విలక్కణంపుడి, పొన్నేరి డివిజన్‌లోని చోళవరం, అంబత్తూరు డివిజన్‌లోని వానగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆపరేషన్‌ల ప్రక్రియను ప్రారంభించారు. నెల రోజుల్లో 21,700 వీధి శునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయనున్నట్టు అధికారులు వివరించారు. ఆపరేషన్‌ల అనంతరం మూడు రోజుల పాటు పర్యవేక్షణ చేయనున్నారు.


