అంకాళపరమేశ్వరికి కుంభ భోజనం నైవేద్యం
తిరువళ్లూరు: అంకాళపరమేశ్వరి అమ్మ వారికి మాంసాహార భోజనం పెట్టిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గత ఆదివారం శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం మూడవ రోజైన బుధవారం పుట్లూరు, పెద్దపాళ్యంతిరువళ్లూరుతోపాటు జిల్లా నలుమూలల వున్న అమ్మవారి ఆలయాల్లో శ్మశన కొల్ల నిర్వహించారు. శ్మశానికి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి రాక్షసుడిని వధ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గురువారం రాత్రి తిరువళ్లూరు కట్టబొమ్మన్ వీధిలోని అంకాళపరమేశ్వరి అమ్మవారి ఆలయంతోపాటు పలు ఆలయాల్లో కుంభ భోజనం పెట్టి పూజలు నిర్వహించారు. అమ్మవారికి మాంసం నైవేద్యంగా పెట్టి పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు.


