సర్వోత్తమ సేవగా పశు వికాస్ డే
సాక్షి, చైన్నె: ఎస్‌ఎంఎఫ్ జీ ఇండియా క్రెడిట్ నేతృత్వంలో 8వ ఎడిషన్‌గా పశు వికాస్ డే(పీవీడీ)ను ఘనంగా గురువారం నిర్వహించారు. సర్వోత్తమ సేవ, పశు, కుటుంబం, ప్రగతి అనే నినాదంతో గ్రామీణ అభివృద్ధికి కట్టుబడే విధంగా ముందడుగు వేశారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లోని 510 గ్రామశక్తి శాఖల ద్వారా 1.4 లక్షల పశువులకు వైద్య సేవలు అందించగా, 1.55 లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చారు. 30వేలకు పైగా కుటుంబాలు ఈ కార్యక్రమంతో ప్రయోజనం పొందాయి. తమిళనాడులో 68 ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించి, 21వేలకు పైగా పశువులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, టీకాలు, మందులు అందించారు. ఆ సంస్థ ఎండీ రవి నారాయణన్ మాట్లాడుతూ, గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి పశుసంపద ఆరోగ్యం ఎంతో కీలకమన్నారు.


