తమిళనాడుకు కేంద్రం పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

తమిళనాడుకు కేంద్రం పెద్దపీట

Feb 1 2026 3:37 AM | Updated on Feb 1 2026 3:37 AM

తమిళనాడుకు కేంద్రం పెద్దపీట

తమిళనాడుకు కేంద్రం పెద్దపీట

● జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్య

కొరుక్కుపేట: తమిళనాడు రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఎప్పుడూ పెద్ద పీట వేస్తూనే ఉందని బీజేపీ దక్షిణ భారత బడ్జెట్‌ ప్రచార అధికార ప్రతినిధి నాయకులు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. చైన్నెలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ గత 11 సంవత్సరంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధిక స్థాయిలో నిధులను అందించిందని, గతంలోని 10 ఏళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం అందించిన నిధులు కంటే అది దాదాపు 5 రెట్లు ఎక్కువని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు కల్చర్‌ పైనా, భాషపైనా, ప్రజలపైనా ఎంతో గౌరవం, మక్కువ చూపారని అన్నారు. సంస్కృతి పట్ల, భాషపట్లనే కాకుండా నిధుల కేటాయింపులో కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అవినీతియమైన డీఎంకే ప్రభుత్వం నిధులను పూర్తిగా దుర్వినియోగం చేయటంతో పాటూ రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని ధ్వజమెత్తారు. అందుకే కాంగ్రెస్‌ –డీఎంకే కూటమి రానున్న ఎన్నికల్లో పెద్ద ఓటమిని చవిచూడబోతుందన్నారు. ప్రజలందరూ కూడా బీజేపీ అన్నాడీఎంకే కూటమి రాబోతుందని , డబల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం త్వరలో రాబోతుందని డబుల్‌ స్పీడ్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనుందని జోస్యం చెప్పారు. ఆదివారం నిర్మాలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండబోతుందని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement