ఐఐటీ మద్రాసుతో డైమ్లర్ డీఐసీవీ భాగస్వామ్యం
సాక్షి,చైన్నె: ఐఐటీ మద్రాసు, డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ (డీఐసీవీ) మధ్య వాణిజ్య డ్రైవింగ్ భద్రతను పెంచే రీతిలో డ్రైవర్ రేటింగ్ సిస్టమ్ అభివృద్ధికి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన భాగస్వామ్య ఒప్పందాలు జరిగాయి. ఈ సిస్టమ్ వాణిజ్య డ్రైవర్ల పనితీరు, భద్రత, శ్రేయస్సును పర్యవేక్షించడం ద్వారా ఫ్లీట్ ఆపరేటర్లు, రాయితీదారులు చ ప్రభుత్వాలకు ఉపయోగపడుతుందని ప్రకటించారు. స్మార్ట్‌ఫోన్ ఆధారిత ఇన్‌పుట్‌లు, సెన్సర్ డేటా ద్వారా, సురక్షిత డ్రైవింగ్ ప్రోత్సహించనున్నట్లు వివరించారు. తద్వారా ప్రమాదాలను తగ్గిస్తుందని, సమయం, డబ్బు ఆదా చేయడంలో సహాయ పడుతుందని ప్రకటించారు. కార్యక్రమంలో ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్ గీతా కృష్ణన్ రామదురై, డైమ్లర్ ప్రతినిధులు పాల్గొన్నారు.


