ఘనంగా దంత కళాశాల స్నాతకోత్సవం
సాక్షి, చైన్నె : దంత విద్య, పరిశోధనలలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 32వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో 84 మంది బీడీఎస్, 26 మంది ఎండీ విద్యార్థులతో సహా మొత్తం 110 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు ప్రదానంచేశారు. ఈ వేడుకకు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ హెగ్డే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ విద్యాసంస్థ చైర్మన్ డాక్టర్ జగత్రక్షగన్ అధ్యక్షత వహించిన కార్యక్రమానికి, చైర్‌పర్సన్ డాక్టర్ జె. శ్రీనిష, ఎండీ ఎన్. ఇలమారన్ , వీసీ సుందరరాజన్, రిజిస్టార్ ఎస్. భూమినాథన్ లు హాజరయ్యారు. ఈసందర్భంగా డాక్టర్ జే శ్రీనిష మాట్లాడుతూ, గత ఏడాది ర్యాంకింగ్‌లో తమిళనాడులో 5వ స్థానం, దేశంలో 27వ స్థానం తమకు దక్కిందని వివరించారు. నైతిక విలువలు, రోగులకు సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని సూచించారు. కళాశాల డీన్ డాక్టర్ ఎం.ఎస్. కన్నన్ మాట్లాడుతూ సంస్థ ఇప్పటివరకు 36 జాతీయ అంతర్జాతీయ అకడమిక్ కుదుర్చుకుందని తెలిపారు.


