కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
వేలూరు: ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తొలగించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేలూరు అన్నారోడ్డులో నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని ఆందోళన నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాహీద్‌బాషా ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేదల సమస్యలను గాలికొదిలి పెట్టి కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఉపాధి పథకానికి పేరు మార్చడం ప్రస్తుతం అవసరమా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతారన్నారు. దేశంలో నిత్యావసర ధరలతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతుంటే వాటిని గాలికొదిలి పెట్టి ఉపాధి పథకం పేరు మార్చడం, కూలీలకు పని దినాలు తగ్గించడం వంటి పనులు చేయడం సరికాదని మండిపడ్డారు. పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు టీకా రామన్, నేతలు తిరువలం గణేష్, కాట్పాడి జార్జీ, కామరాజ్, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


