చట్టాలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలు అమలు చేయాలి

Feb 1 2026 3:37 AM | Updated on Feb 1 2026 3:37 AM

చట్టాలు అమలు చేయాలి

చట్టాలు అమలు చేయాలి

కొరుక్కుపేట: బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఎంపీ ఎస్‌ఆర్‌ శివలింగం అన్నారు. బాల్‌ వివాహ్‌ ముక్తి రథ్‌ అనే జాతీయ ప్రచారంలో భాగంగా బాల్య వివాహాలను నిర్మాలించడానికి చేపట్టిన 100 రోజుల విస్తృత అవగాహన ప్రచారం సేలం జిల్లా బెతానాయకన్‌ పాళయంలోని అన్నై సత్య ప్రభుత్వ బాలల సంరక్షణ సంస్థలో ఏర్పాటు చేశారు. ఎంపీలు ఎస్‌ఆర్‌ శివలింగం, డి.మలైయరసన్‌ పాల్గొని అవగాహన ప్రచార కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. దీనిని సేలం జిల్లా పరిపాలన, ఇండియన్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీడబ్ల్యూఓ), జెస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ (జేఆర్‌సీ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు .ముందుగా బాల్య వివాహాల నిర్మాలనపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఎంపీలు ఆవిష్కరించారు. తొలిప్రతిని సేలం జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎస్‌ మురళీ స్వీకరించగా, రెండవ ప్రతిని సేలం కలెక్టరేట్‌ బాలల సంరక్షణ అధికారి ఎన్‌.ఇందిరాజిత్‌ స్వీకరించారు. ఐసీడబ్ల్యూఓ కార్యదర్శి ఏజే హరిహరన్‌ మాట్లాడుతూ అవగాహన కార్యక్రమాలు పిల్లల హక్కులను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు .ఈ ప్రచారానికి మద్దతు అందించినందుకు జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్ట్రెన్‌ వారికి దన్యవాదాలు తెలిపారు. సమాచారం కోసం బాలల హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 1098ను సంప్రదించవచ్చునని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement