అత్యాధునిక వసతులతో బస్టాండ్
తిరుత్తణి: తిరుత్తణిలో రూ.20.97 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మాణంలో వున్న బస్టాండు నిర్మాణ పనులను మున్సిపల్ శాఖ డైరెక్టర్ శనివారం తనిఖీ చేశారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక నగరం తిరుత్తణికి ప్రతిరోజూ వేలాది మంది వచ్చి వెళుతుంటారు. దీంతో వాహన రద్దీ, ట్రాఫిక్ పరిష్కరించే విధంగా అరక్కోణం రోడ్డులో 4.92 ఎకరాల విస్తీర్ణంలో ఒకే సారి 28 బస్సులు ఆగిలా అత్యాధునిక బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 98 శాతం పనులు పూర్తికావడంతో త్వరలో ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఈక్రమంలో బస్టాండు తుదిదశ నిర్మాణ పనులను మున్సిపల్ శాఖ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతాప్‌తో కలసి తనిఖీ చేశారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ శరవణకుమార్, మున్సిపల్ ఇంజినీర్ సేరేంద్రన్ పాల్గొన్నారు.


