క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jan 31 2026 6:50 AM | Updated on Jan 31 2026 6:50 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

హస్తకళా నైపుణ్యంతో దస్తకారి క్రాఫ్ట్‌ బజార్‌

సాక్షి, చైన్నె: చైన్నెలో భారతదేశపు సంప్రదాయ చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలను చాటే ప్రదర్శనగా దస్తకారి హాత్‌ క్రాఫ్ట్‌ బజార్‌ శుక్రవారం కొలువు దీరింది. భారతదేశం నలుమూలల నుండి కళాకారులను ఒకచోట చేర్చి, వివిధ సాంప్రదాయ కళలు, వస్త్రాలు, చేతి ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. చైన్నె రాజీవ్‌ గాంధీ మార్గంలోని ఎన్‌ఐఎఫ్‌టీ క్యాంపస్‌లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 11.30 నుండి రాత్రి 7. 30 వరకు ఈ ప్రదర్శనను ఉచితంగానే తిలకించవచ్చునని దస్తకారి హాత్‌ సమితి వ్యవస్థాపకురాలు జయ జైట్లీ ప్రకటించారు. ఈ ప్రదర్శనలో పట్టచిత్ర, కలంకారి, గోండ్‌ పెయింటింగ్స్‌, అజ్రాఖ్‌ బ్లాక్‌ ప్రింట్స్‌, ఇకట్‌, చందేరి నేత, ధోక్రా మెటల్‌ క్రాఫ్ట్‌, చెన్నపట్న బొమ్మలు వంటి సంప్రదాయ కళలు, వస్త్రాలు కొలువు దీర్చామన్నారు. ప్రత్యేక ఆకర్షణగా పశ్చిమ బెంగాల్‌ కళా నైపుణ్యాలు, రాజస్థానీ వంటకాల రుచిని అందిస్తున్నామన్నారు.

రేపటి నుంచి తైపూసం ఉత్సవం

తిరువొత్తియూర్‌: తైపూసం సందర్భంగా కోయంబేడు కాళియమ్మన్‌ కోవిల్‌ వీధిలోని పనై మరత్తు శ్రీ మునీశ్వరర్‌ ఆలయంలో తైపూస ఉత్సవం పిభ్రవరి 1వ తేదీ నుంచి 3 రోజులపాటు జరగనుంది. ఉత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 7 గంటలకు ద్రౌపది అమ్మన్‌ ఆలయం నుంచి మహిళలు, ప్రజలు పాల బిందెలతో తీసుకొని ఊరేగింపుగా వస్తారు. ఊరేగింపు అనంతరం మునీశ్వరర్‌కు పాలాభిషేకం జరగనుంది. అలాగే మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం 6 గంటలకు పంబై ఉడుకై ్కతో పతివిళక్కు పూజ(జ్యోతి పూజ), రాత్రి 8 గంటలకు అన్నదానం, 2వ తేదీ ఉదయం 9 గంటలకు మేకను బలిచ్చి అన్నదానం, 3వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడయాత్తి ఉత్సవం మాంసాహార అన్నదానం జరగనుంది. ఈ ఉత్సవ ఏర్పాట్లను పనై మరత్తు శ్రీమునీశ్వరర్‌ భక్తుల బృందం, పూజారి ఎస్‌.వి.కుమార్‌ చేస్తున్నారు.

తైపూసం ప్రత్యేక రైళ్లు

కొరుక్కుపేట: కడలూరు జిల్లా వడలూరులో జరగనున్న తైపూసం ఉత్సవంలో(ఆదివారం) వేలాది మంది భక్తులు పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా విల్లుపురం, విరుదాచలం నుంచి వడలూరుకు ప్రత్యేక రైళ్లు నడపబడతాయని, 3 రోజులపాటు పలు రైళ్లు నడపబడతాయిని ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో విల్లుపురం రైల్వే స్టేషన్‌ నుంచి రైళ్లు నడుస్తాయని తిరుచ్చి డివిజన్‌ రైల్వే పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీస్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది.

విద్యుత్‌ శాఖ అధికారులు అరెస్ట్‌

అన్నానగర్‌: విద్యుత్‌ బోర్డుకు సంబంధించిన నగదును కాజేసిన ఇద్దరు అధికారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కృష్టగిరి జిల్లా పర్కూర్‌ తాలూకాలోని జగదేవిలో విద్యుత్‌ బోర్డు కార్యాలయం ఉంది. ఏప్రిల్‌, 12, 2013 నుంచి జూన్‌ 19, 2017 నుంచి ఇద్దరు అధికారులు వసూలు చేసిన రూ.3కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.1.70కోట్లు చెల్లించకుండా మోసం చేశారు. ఫిర్యాదు మేరకు జిల్లా క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు గణేష్‌, సెల్వం అనే ఇద్దరు విద్యుత్‌ అధికారులను శుక్రవారం అరెస్టు చేశారు.

రేబిస్‌ వ్యాధితో రైతు మృతి

తిరువొత్తియూరు: కృష్టగిరి సమీపంలో పెంపుడు కుక్క కరవడంతో గాయపడిన రైతు, సకాలంలో చికిత్స అందక మృతి చెందిన సంఘటన విషాదాన్ని కలిగించింది. కృష్టగిరి సమీపంలోని తవలం గ్రామానికి చెందిన ఏకాంబరం(45) రైతు. ఆయన తన ఇంట్లో నాటు కుక్కను పెంచుకుంటున్నారు. గత 3 నెలల క్రితం ఆ కుక్క ఏకాంబరం ఎడమ కాలును కరిచింది. దీంతో బెల్లారంపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవలం ఒకే ఒక్క ఇంజక్షన్‌ వేయించుకున్న ఏకాంబరం, ఆ తర్వాత వైద్యులు సూచించిన మేరకు సక్రమంగా చికిత్స తీసుకోలేదు. ఈ క్రమంలో గత 15 రోజులుగా ఆయనకు ఒంట్లో పలు రకాల ఇబ్బందులు వచ్చాయి. ఆయన ఒక పక్క చేయి ఎక్కువగా నొప్పి పెట్టినా, దానికీ సక్రమంగా చికిత్స తీసుకోలేదు. ఈ నేపథ్యంలో గత 27వ తేదీన తీవ్రమైన జ్వరం వచ్చి వాంతులు చేసుకున్నారు. దీంతో ఆయన్ని వెంటనే బెంగళూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆయన్ని పరీక్షించిన వైద్యులు ఆయనకు రేబిస్‌ లక్షణాలు ఉన్నాయని చెప్పి వెనక్కి పంపేశారు. దీంతో ఆయన్ని వెంటనే కృష్టగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఏకాంబరం మృతి చెందారు.

బైక్‌ దొంగ అరెస్ట్‌

తిరువొత్తియూరు: చైన్నె కే.కే.నగర్‌ శివలింగపురం ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగి ఇంటి ముందు నిలిపి వుంచిన మోటార్‌ సైకిల్‌ చోరీకి గురైంది. ఫిర్యాదు మేరకు పోలీసుల దర్యాప్తులో ఓ వ్యక్తి డూప్లికేట్‌ తాళంతో బైక్‌ను తీసుకెళ్తున్నట్లు రికార్డయింది. విచారణలో మోటార్‌ సైకిల్‌ చోరీ చేసింది ఎంజీఆర్‌ నగర్‌, ప్రాంతానికి చెందిన సతీష్‌(34) అని తెలిసింది. అతడిని ప్రత్యేక బృందం పోలీసులు అరెస్ట్‌ చేశారు. 9 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement