వైభవం.. మహాకుంభాభిషేకం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. మహాకుంభాభిషేకం

Jan 31 2026 6:50 AM | Updated on Jan 31 2026 6:50 AM

వైభవం.. మహాకుంభాభిషేకం

వైభవం.. మహాకుంభాభిషేకం

వేలూరు: వేలూరు జిల్లా కేవీకుప్పం తాలుకా పరిధిలోని లత్తేరి గ్రామంలో శ్రీ సెల్వ వినాయకుడి ఆలయంలో అష్టబంధన మహాకుంబాభిషేకం శుక్రవారం ఉదయం వైభవంగా జరిగింది. ముందుగా జయకుమార్‌ స్వామిజీ ఆధ్వర్యంలో వేద పండితులు, శివాచార్యులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పుణ్య నదుల నుంచి తీసుకొచ్చిన పుణిద నీటిని కళాశాలలో ఉంచి ప్రత్యేక వేద మంత్రాల నడుమ యాగ పూజలు చేసి కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయ గోపురంపై చల్లి కుంభాభిషేకం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో విగ్రహాన్ని అమర్చి ప్రత్యేక పూజలు, పుష్పాలంకరణలు చేసి దీపారాధన పూజలు చేశారు. కుంభాభిషేకంలో ఉత్సవ కమిటీ సభ్యులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement