రూ. 9.25 కోట్ల విలువైన బంగారు కడ్డీలు స్వాధీనం
అన్నానగర్: కేరళలోని పాలక్కాడ్ నుండి బస్సు కోయంబత్తూరు జిల్లా పోలీసు పరిధిలోని వాలైయారు చెక్ పోస్ట్ మీదుగా బుధవారం కోయంబత్తూరు వైపు వస్తోంది. ఆ బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ ప్రయాణికుడి దగ్గర 6 కిలోల 140 గ్రాముల బంగారు కడ్డీలను గుర్తించారు. కేరళ నుంచి కోయంబత్తూరుకు అక్రమంగా తరిలిస్తున్నట్లు వెల్లడైంది. అయితే సరైన పత్రాలు లేకపోవడంతో రూ. 9.25 కోట్ల విలువైన బంగారు కడ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పట్టుబడిన యువకుడు నిఫిన్(29) అని తేలింది. అతడు పనిచేసే బట్టల దుకాణం వ్యాపారి రెహమాన్ వీటిని పంపించినట్లు తేలడంతో ఆ దిశగా విచారణ చేస్తున్నారు.
డీఏసీ అంబాసిడర్‌గా
ఏఆర్ రెహమాన్
సాక్షి, చైన్నె: డీఏసీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ నియమించచారు. గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్ సమక్షంలో చైన్నెలోని ఐదు ప్రదేశాలలో సుమారు 1000 గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. డీఏసీ డెవలపర్స్ నేతృత్వంలో చైన్నె – బెంగళూరు జాతీయ రహదారిలోని సుంకువారి చత్రం ,పోరూర్‌లోని కాట్టుపాక్కం, కుమరన్ చావడి, షోళింగనల్లూరు, ఓఎంఆర్ సిరిచ్చేరిలలో నిర్మించనున్న గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానికంగా జరిగింది. ఇందులో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈసందర్భంగా ఆయన్ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్టు డీఏసీ డెవలపర్స్ ఎండీ ఎస్ సతీష్‌కుమార్ ప్రకటించారు. డీఏసీ కుటుంబంలో ఏఆర్ రెహమాన్ ఓ భాగం అయ్యారని, ఇది తమనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏఆర్ రెహమాన్‌మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు ఓ కల అని పేర్కొంటూ, దక్షిణ భారత దేశంలో అత్యంత నాణ్యత, ఆశాజనకమైన సంస్థగా ఉన్న డీఏసీతో కొత్త పయనం మొదలైందన్నారు.
కళాశాల క్యాంటీన్‌లో కీచకపర్వం
సాక్షి, చైన్నె: కళాశాలలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన సన్నిహితులతో కలిసి క్యాంటిన్లో పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నందనం ఆర్ట్స్ కళాశాలలో కలకలం రేపింది. చైన్నె నందనం ఆర్ట్స్ కళాశాలలో పుదుకోట్టైకు చెందిన గుణశేఖరన్ ఓ విభాగంలో పనిచేస్తున్నాడు. ఇతడి సన్నిహితుడైన ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి ఇదే కళాశాల ఆవరణలో క్యాంటీన్ నడుపుతున్నాడు. ఇక్కడ అరియలూరుకు చెందిన 22 ఏళ్ల ఓ యువతి గత కొన్ని నెలలుగా పనిచేస్తూ వస్తున్నారు. ఈమెతో గత కొద్దిరోజులుగా గుణ శేఖరన్ అసభ్యకరంగా ప్రవరిస్తూ వచ్చినట్టు సమాచారం.ఈ పరిస్థితులలో గురువారం ఉదయం ఆ యువతి తీవ్ర మనో వేదనతో కన్నీటి పర్యంతంతో కళాశాల క్యాంటీన్ నుంచి బయటకు వెళ్లడాన్ని విద్యార్థులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఆయువతిపై గుణశేఖరన్‌తో పాటూ ఆ క్యాంటీన్ నిర్వహిస్తున్న ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు, మరో ముగ్గురు లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా వేధించినట్టు తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. కాగా ఈ ఘటనపై అక్కడి విద్యార్ధి సంఘాలు కన్నెర్ర చేశాయి. విద్యార్ధినులకు ఇక్కడ భద్రత లేదంటూ ఆందోలనకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. గుణ శేఖరన్‌తోపాటూ మిగిలిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా గత ఏడాది అన్నా వర్సిటీ లో ఓ విద్యార్ధినిపై క్యాంటీన్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన పెను కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈఘటన మరువక ముందే తాజా అన్నావర్సిటీకి కూత వేటు దూరంలో ఉన్న నందనం కళాశాలలో కీచక పర్వం వెలుగు చూడటం కలకలం రేపింది.
రూ. 9.25 కోట్ల విలువైన బంగారు కడ్డీలు స్వాధీనం


