చేనేత రంగంలోకి రూ. 912 కోట్లు
సాక్షి, చైన్నె: చేనేత, వస్త్ర పరిశ్రమలోకి పెట్టుబడులు పెట్టేందుకు 55 సంస్థలు ముందుకు వచ్చాయి. 13,080 మందికి ఉపాధి కల్పిస్తూ రూ. 912. 97 కోట్లతో పెట్టుబడుల దిశగా టెక్స్‌టైల్స్ శాఖతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. కోయంబత్తూరులోని కోడిసియాలో ప్రపథమంగా జరిగిన అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమ సమావేశం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. తమిళ్ నాడు న్యూ ఇంటిగ్రేటెడ్ టైకె ్స్టల్స్ విధానం మేరకు వస్త్ర పరిశ్రమలో నిమగ్నమైన కంపెనీలు పెట్టుబడి సబ్సిడీ, వడ్డీ సబ్సిడీ, సాంకేతిక వస్త్ర పార్క్‌లలో ఈ పెట్టుబడులు పెట్టేందుకు ముందుక వచ్చాయి. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్ గాంధీ, ఎమ్మెల్యే వి సెంథిల్ బాలాజీ, కోయంబత్తూరు కార్పొరేషన్ మేయర్ కె. రంగనాయకీరామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.


