అ‘పూర్వ’ కలయిక | - | Sakshi
Sakshi News home page

అ‘పూర్వ’ కలయిక

Jan 28 2026 7:04 AM | Updated on Jan 28 2026 7:04 AM

అ‘పూర్వ’ కలయిక

అ‘పూర్వ’ కలయిక

సాక్షి, చైన్నె : దశాబ్దాల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఒక చోట చేరారు. నాటి జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. చైన్నెలోని 73 సంవత్సరాల పాటుగా విద్యా రంగంలో అగుర్చంద్‌ మన్ముల్‌ జైన్‌ కళాశాల సేవలను అందిస్తోంది. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులకు 1500 మందికి పైగా ఏకం అయ్యారు. తమ కళాశాలకు చేరుకున్నారు. బ్రహ్మాండ వేడుకతో ఎఎం జైన్‌ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తమ మిత్రులతో, అధ్యాపక సిబ్బందితో పూర్వ విద్యార్థులు ఆనందాన్ని పంచుకున్నారు. ఏడు దశాబ్దాలకు పైగా తరాలను తీర్చిదిద్దిన సంస్థతో పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను, అనుబంధాన్ని, ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మెంటలిస్ట్‌ అభిషేక్‌ భాస్కర్‌ ప్రదర్శన ఆహుతలను ఆకట్టుంది. గాయని నిత్యశ్రీ వెంకటరామన్‌ సంగీత విభావరి వీనుల విందుగా జరిగింది. పదవీ విరమణ పొందిన ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించుకున్నారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు నరేంద్ర నహర్‌ మాట్లాడుతూ, 73 సంవత్సరాలకు పైగా ఏంఎం జైన్‌ కళాశాల అభ్యాసం, విలువలు, శ్రేష్టతకు కేంద్రంగా ఉంటూ వస్తుందని వివరించారు. తమ పూర్వ విద్యార్థుల సమావేశం 2026 అఖండ విజయం సాధించిందన్నారు. ఎక్కడెక్కడ స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్న వారందరూ ఇక్కడకు వచ్చి తన ఆనందాన్ని పంచుకున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement