కేవీబీ, ఐఓబీలలో.. | - | Sakshi
Sakshi News home page

కేవీబీ, ఐఓబీలలో..

Jan 27 2026 8:23 AM | Updated on Jan 27 2026 8:23 AM

కేవీబ

కేవీబీ, ఐఓబీలలో..

కరూర్‌లోని కేంద్ర కార్యాలయంలో దేశ భక్తిని చాటే విధంగా జరిగిన వేడుకలకు కరూర్‌ వైశ్యా బ్యాంక్‌(కేవీబీ) ఎండీ బి రమేష్‌ బాబు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. కేవీబీ ఉద్యోగులు, వారి కుటుంబంతో కలిసి వేడుకలలో భాగస్వామ్యమయ్యారు. జాతీయ ఐక్యతకు తమ బ్యాంక్‌ అంకిత భావాన్ని గుర్తు చేశారు. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ)నేతృత్వంలో చైన్నెలోని ప్రధాన కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ బ్యాంక్‌ ఎండీ అజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ జాతీయ జెండాను ఎగుర వేశారు. జాతీయ సమైఖ్యతను చాటే విధంగా సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. బ్యాంక్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ధనరాజ్‌, చీఫ్‌ విలిజెన్స్‌ ఆఫీసర్‌ రాజీవ్‌కుమార్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌లు ఈ కార్యక్రమానికి హజరయ్యారు. ఇండియన్‌ ఆయిల్‌ భవన్‌లో జరిగిన వేడుకలలో ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ అన్నాదురై, ఎం సుధాకర్‌లు హాజరై జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. బాబు జగజ్జీవన్‌రామ్‌ స్టేడియంలో చైన్నె ఫోర్ట్‌ ఛైర్మన్‌ విశ్వనాథన్‌ నేతృత్వంలో వేడుకలు జరిగాయి.

కేవీబీ, ఐఓబీలలో.. 1
1/1

కేవీబీ, ఐఓబీలలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement