ప్రయణికులకు మెరుగైన సేవ
దక్షిణ రైల్వే నేతృత్వంలో పెరంబూరులోని రైల్వే స్టేడియంలో ఆర్‌పీఎఫ్ ఐజీ, ప్రధాన సెక్యూరిటీ కమిషనర్ కె. అరుల్ జ్యోతి సమక్షంలో జాతీయ జెండాను దక్షిణ రైల్వే జీఎం ఆర్‌ఎన్ సింగ్ ఎగుర వేశారు.రైల్వేబోర్డుమాజీ సభ్యుడు నవీన్ గులాటి, దక్షిణ రైల్వే అదనపు జీఎం విపిన్ కుమార్, చైన్నె డీఆర్‌ఎం శైలేంద్ర సింగ్,దక్షిణ రైల్వే మహిళా ప్రధాన కార్యాలయ సంస్థ అధ్యక్షురాలు సోనియా సింగ్, ఉపాధ్యక్షురాలు చారు గుప్తా , ఇతర రైల్వే అధికారులు హాజరయ్యారు. రైల్వేలో తమ సేవలు, శ్రామిక శక్తి, ప్రయాణికులకు మెరుగైన సేవలు, జోన్ పనితీరు గురించి ఈసందర్భంగా ఆర్‌ఎన్ సింగ్ వివరించారు. ఎగ్మూర్‌లోని రైల్వే నిర్మాణ సంస్థ చీప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సుశీల్‌కుమార్ మౌర్య, డీఆర్‌ఎం శైలేంద్ర సింగ్, లోకో వర్క్ మేనేజర్ డి నీలకంఠన్‌లు రైల్వే కార్యాలయాలలో జెండా ఆవిష్కరించారు. చైన్నెలోని రైల్వే క్లైయిమ్స్ ట్రిబ్యునల్ అదనపు రిజిస్టార్ జయంతి, రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ ప్రతిభా దేవేంద్రన్ యాదవ్‌లు వారివారి కార్యాలయాలలో జెండా ఎగుర వేశారు. జాతీయ సమైక్యతను చాటే విధంగా బెలూన్లను ఎగుర వేశారు.
ప్రయణికులకు మెరుగైన సేవ


