ద్రౌపది–2ను దెబ్బ తీసిన మంగాత్తా
తమిళసినిమా: మంగాత్తా చిత్రం కారణంగా తమ ద్రౌపది–2 చిత్ర వసూళ్లకు బాధ పడ్డానని ఆ చిత్ర దర్శకుడు మోహన్‌కి ఆవేదనను వ్యక్తం చేశారు. అజిత్, అర్జున్, త్రిష ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మంగాత్తా. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత 2011 లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్రం ఈనెల 23న రీ రిలీజ్ అయ్యి మళ్లీ మంచి వసూళ్లను సాధిస్తోంది. కాగా ఇదే తేదీన విడుదలైన స్ట్రైట్ చిత్రం ద్రౌపది–2. చారిత్రిక కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి మోహన్.జి దర్శకత్వం వహించారు. రిచర్డ్ రిషి కథానాయకుడిగా నటించిన ఇందులో ద్రౌపదిగా రక్షణ నటించారు. నట్టి నటరాజ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఈచిత్రాన్ని ముందు జనవరి 30న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించారు.అయితే జనవరి 9న విడుదల కావాల్సిన విజయ్ జననాయకన్ చిత్రం వాయిదా పడడంతో పలు చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. అదేవిధంగా విజయ్ నటించిన తెరి చిత్రాన్ని ఈనెల 23న రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత కలైపులి ఎస్.థాను ప్రకటించి ఆ తర్వాత ఆ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అదే తేదీన అజిత్ నటించిన మంగాత్తా చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈచిత్రంతోపాటు ద్రౌపది–2 ఇతర చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. మంగాత్తా వసూళ్ల ముందు చిత్రాలు నిలవలేకపోతున్నాయి. ఇదే విషయాన్ని ద్రౌపది–2చిత్ర దర్శకుడు మోహన్‌జి ఒక వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ద్రౌపది–2 చిత్రాన్ని మంగాత్తాతో పాటు విడుదల చేయడం పొరపాటు అయిందని పేర్కొన్నారు. ఒక మంచి చారిత్రక కథా చిత్రాన్ని ప్రేక్షక్షుల్లోకి తీసుకెళ్లలేకపోయామని మోహన్ జి పేర్కొన్నారు. అదేవిధంగా కొందరు ద్రౌపది–2 చిత్రాన్ని వివాదాస్పద చిత్రంగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.


