6 నుంచి జాక్టోజియో దీక్షలు
వేలూరు: జనవరి 6 నుంచి జాక్టో జియో ప్రతినిధుల సంఘం ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు సమ్మెలో పాల్గొనాలని మహానాడులో తీర్మానం చేశారు. ప్రతినిధుల సంఘం ఆధ్వర్యంలో వేలూరులోని ప్రైవేటు కల్యాణ మండపంలో మహానాడు నిర్వహించారు. ఇందులో సభ్యులు మాట్లాడుతూ సంవత్సరంలో ఎన్నికల సమయంలో డీఎంకే ప్రభుత్వం ఉద్యోగులకు వచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో అన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు జీవనాధారం కోల్పోయే అవకాశం ఉందన్నారు. కొత్త పెన్షన్ పథకాన్ని రద్దుచేసి పాత పథకాన్ని అమలు చేయాలని, ఈ నెల 29 నుంచి జనవరి 4వ తేదీ వరకు తాలూకా స్థాయిలో ప్రచారం చేయడం ఆరవ తేదీ నుంచి సమ్మెలో పాల్గొనడం, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో నిరాహార దీక్షలు పూనుకుంటామని మహానాడులో తీర్మానం చేశారు. తమిళనాడు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి రాష్ట్ర ఆర్గనైజర్ రక్షిత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనార్దన్, కరుణానిధి శేఖర్ సెల్వకుమార్ జోసఫ్ అన్నయ్య జై కుమార్ జీడీ బాబు అన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


