ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
కొరుక్కుపేట: చైన్నెలోని కస్టమ్స్ హౌస్‌లో మద్రాస్ కస్టమ్స్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బుధవారం ఉదయం చైన్నెలోని రాజాజీసాలైలోని కస్టమ్స్ హౌస్‌లో సంఘం ఉపాధ్యక్షుడు ఆదిలక్ష్మణన్, కోశాధికారి ఎం.ఎస్.కార్తికేయన్ నేతృత్వంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఇందులో చైన్నె కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ ఎన్.మోహన్, అసిస్టెంట్ కమిషనర్ జీకే రాధాకృష్ణన్, రమేష్‌బాబు, మునుస్వామి, ఇందిరా, శశిరేఖ, ప్రేమ పాల్గొన్నారు.


