కౌన్సిలర్లుగా దివ్యాంగులు బాధ్యతల స్వీకరణ
తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా వున్న మున్సిపాలిటీ, మేజర్ పంచాయతీలలో వున్న దివ్యాంగులను కౌన్సిలర్లుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు తిరువళ్లూరు మున్సిపల్ కౌన్సిలర్‌గా మురలి బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా ఆవడి, తిరువళ్లూరు, పొన్నేరి, తిరునిండ్రవూర్, పూందమల్లి, తిరువేర్కాడు మున్సిపాలిటీలు, నారావారికుప్పం, తిరుమళిసై సహా ఎనిమిది మేజర్ పంచాయతీలో కౌన్సిలర్‌లను నియమించారు. వీరికి ఆయా మున్సిపల్ కమిషనర్‌లు బుధవారం ఉదయం పదవీ ప్రమాణం చేయించారు. తిరువళ్లూరు మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా మురళి బాధ్యతలు స్వీకరించారు. తిరువళ్లూరులో జరిగిన కార్యక్రమంలో చైర్‌పర్సన్ ఉదయమలర్, కమిషనర్ దామోదరన్, వైస్ చైర్మన్ రవిచంద్రన్, కౌన్సిలర్లు అరుణ జైకృష్ణ పాల్గొన్నారు.


