21 ఏళ్ల తరువాత హత్యకేసు నిందితుడి అరెస్టు
తిరువళ్లూరు: తన భార్య గురించి తప్పుగా మాట్లాడిన స్నేహితుడ్ని దారుణంగా హత్య చేసి 21 ఏళ్లగా అజ్ఞాతంలో వున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఎన్నూరు పోలీసుస్టేషన్ పరిదిలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ అలియాస్ రఫీక్, అతడి భార్య రసూలు బీబీ జీవనం సాగించేవారు. రాజేంద్రన్‌కు అదే ప్రాంతానికి చెందిన తాజుద్దీన్‌తో స్నేహం చేసేవాడు. ఈ క్రమంలో 2004వ సంవత్సరంలో మద్యం సేవిస్తున్న సమయంలో రాజేంద్రన్ భార్య బీబీ గురించి తాజుద్దీన్ అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో అప్పటికేమద్యం మత్తులో వున్న రాజేంద్రన్ కత్తితో తాజుద్దీన్‌పై దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటనపై అప్పట్లో ఎన్నూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదయి నిందితుడ్ని అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన రాజేంద్రన్ కోర్టు విచారణకు హాజరుకాకుండా పరారయ్యారు. దీంతో ఇతడిపై కోర్టు పీడీ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి 21 ఏళ్ల తరువాత రాజేంద్రన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


