సేవా దృక్పథంపై అవగాహన ఉండాలి
వేలూరు: విద్యార్థినులు మానవత్వం, సేవా దృక్పథంపై అవగాహన కలిగి ఉండాలని రిటైర్డ్ వృత్తి విద్యా ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాట్పాడి జూనియర్ రెడ్‌క్రాస్ కార్యదర్శి జనార్దన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని అగ్జిలియమ్ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ ఆరోగ్య జయశీలి అధ్యక్షతన ప్రత్యేక సదస్సు జరిగింది. సదస్సులో ఆయన మాట్లాడుతూ సాటి మనషుల పట్ల అప్యాయత, దయ, కరుణ చూపడం, ప్రేమ చూపడాన్ని మానవత్వం అని చెప్పవచ్చాన్నారు. ఇతరులకు బాధ కలిగించకుండా సంతోషాన్ని ఇవ్వాలన్నారు. తమిళ భాషకు, తమిళ ప్రజలకు అనేక అప్యాయతలు ఉంటాయని వీటిని విద్యార్థినులు చిన్న వయస్సు నుంచే అలవాటు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం మదర్‌థెరిస్సా లాంటి ఎంతో మంది మహిళలు బహుళ కుటుంబాల్లో నేటికి జీవిస్తున్నారన్నారు. ప్రిన్సిపల్ ఆరోగ్య జయశీలి మాట్లాడుతూ విద్యార్థినులు మొబైల్ ఫోన్‌ను వినోద సాధనంగా కాకుండా విద్యా సాధనంగా కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. వ్యక్తి గ్రత క్రమశిక్షణ పాటిద్దాం, బాగా చదువుదాం, జీవితంలో ఎదుగుదాం మన దేశాభివృద్ధికి దోహదపడదామని ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. అనంతరం సదస్సులో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లును అందజేశారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ అధికారి అముద, అధ్యాపకులు గాయత్రి, మేరి జోసిఫిన్ రాణి, లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ నిత్య, విద్యార్థినులు పాల్గొన్నారు.


