ఘనంగా అపోలో హోమ్ కేర్ వార్షికోత్సవం
కొరుక్కుపేట: అపోలో హోమ్‌కేర్ 10వ వార్షికోత్సవం చైన్నె అన్నాసాలైలో బుధవారం అపోలో ఆస్పత్రుల గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి సమక్షంలో ఘనంగా జరిగింది. ఈసందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగిస్తూ దీర్ఘకాలిక రోగులకు ఇళ్ల వద్దే అపోలో ఆస్పత్రుల్లో లభించే వైద్యసేవలను అందించాలన్న సంకల్పంతో 2015లో అపోలో హోమ్‌కేర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రీతారెడ్డి, ఎండీ డాక్టర్ సునీతారెడ్డి, అపోలో హోమ్ హెల్త్ కేర్ లిమిటెడ్ డైరెక్టర్ హర్షద్‌రెడ్డి, అపోలో హాస్పిటల్ డివిజన్ ప్రెసిడెంట్ డాక్టర్ మధుశశిధర్ పాల్గొన్నారు.


