సర్వసభ్య కసరత్తుల్లో నవ నేతలు | - | Sakshi
Sakshi News home page

సర్వసభ్య కసరత్తుల్లో నవ నేతలు

Nov 27 2025 6:15 AM | Updated on Nov 27 2025 6:15 AM

సర్వసభ్య కసరత్తుల్లో నవ నేతలు

సర్వసభ్య కసరత్తుల్లో నవ నేతలు

సాక్షి, చైన్నె: సర్వసభ్య సమావేశం కసరత్తులను వేగవంతం చేయడానికి తొమ్మిది మందితోకూడిన బృందం అన్నాడీఎంకే రంగంలోకి దిగింది. తర్వాత పార్టీ కార్యక్రమాల విస్తృతం దిశగా ఈ కమిటీ అన్నాడీఎంకే ఽప్రధాన కార్యదర్శి పళణిస్వామికి సలహాలు, సూచనలు ఇవ్వనుంది. అన్నాడీఎంకే బలోపేతం దిశగా పళణిస్వామి దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా ఎవ్వరు వ్యవహరించినా, తన ఆదేశాలను ధిక్కరించినా బయటకు పంపించే పనిలో పడ్డారు. ఈపరిస్థితుల్లో డిసెంబర్‌ 10న జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశం, రాష్ట్ర కార్యవర్గం భేటీ జరగనుంది. ఇందులో కీలక అంశాలను తీర్మానాలుగా ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా జరిగే సర్వసభ్య భేటీ కావడంతో ఇందులో తీసుకునే నిర్ణయాలు కీలకం కానున్నాయి. వీటి గురించి చర్చించి, సమీక్షించేందుకు కమిటీని పళణిస్వామి రంగంలోకి దించారు. ఈ కమిటీ బుధవారం రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. కమిటీలో సినియర్లు ఎస్పీ వేలుమణి, జయకుమార్‌, ఓఎస్‌ మణియన్‌, దిండుగల్‌ శ్రీనివాసన్‌, సీవీ షణ్ముగం, పొల్లాచ్చివి జయరామన్‌, ఆర్‌బీ ఉదయకుమార్‌, వైగై సెల్వన్‌, సెమ్మలై, అగ్రికృష్ణమూర్తి ఉన్నారు. సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, ఏర్పాట్లు, తీర్మానాలు గురించి సమీక్షించారు. అలాగే, పళణిస్వామి పర్యటనలను మరింత ఉధృతం చేయడం, పార్టీ కార్యాక్రమాలు విస్తృతం దిశగా కార్యాచరణలో నిమగ్నమయ్యారు. ఈకమిటీ చర్చించి తీసుకునే నిర్ణయాలు, సలహాలను పళణిస్వామి అమలు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement