ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్‌ కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్‌ కమిషనర్‌

Nov 27 2025 6:15 AM | Updated on Nov 27 2025 6:15 AM

ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్‌ కమిషనర్‌

ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్‌ కమిషనర్‌

కొరుక్కుపేట: చైన్నె పోలీస్‌ కమిషనరేట్‌లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరంలో 18 మంది నుంచి పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌ నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. చైన్నె వేపేరిలోని చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ప్రతి బుధవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరం నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరానికి పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌ హాజరయ్యారు. మహిళలు, వృద్ధులు సహా 18 మందితో ఆయన మాట్లాడారు. వినతులు స్వీకరించి వారి సమస్యలను విన్నారు. అనంతరం కమిషనర్‌ అరుణ్‌, అందిన పిటిషన్లపై చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు చైన్నె పోలీస్‌ ప్రధాన కార్యాలయ డిప్యూటీ కమిషనర్‌ గీత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement