విత్‌లవ్‌ చిత్ర టైటిల్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

విత్‌లవ్‌ చిత్ర టైటిల్‌ విడుదల

Nov 22 2025 7:32 AM | Updated on Nov 22 2025 7:32 AM

విత్‌లవ్‌ చిత్ర టైటిల్‌ విడుదల

విత్‌లవ్‌ చిత్ర టైటిల్‌ విడుదల

తమిళసినిమా: ప్రస్తుతం సినిమా ప్రతిభావంతులైన యువకుల చేతిలో విజయం వైపు పరుగులు తీస్తుందనే చెప్పారు. అలా తన తొలి చిత్రం టూరిస్ట్‌ ఫ్యామిలీతోనే అనూహ్య విజయాన్ని అందుకున్న దర్శకుడు అభిషన్‌ జీవింత్‌. ఆ చిత్రంలో ఈయన ఒక క్యామియో పాత్రను కూడా పోషిచారు. తాజాగా అభిషన్‌ జీవింత్‌ కథానాయకుడిగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. నటి అనస్వర రాజన్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌కు చెందిన జియోన్‌ ఫిలింస్‌ సంస్థ, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ అధినేతలు బసిలియాన్‌ నాజరేత్‌, మహేశ్‌రాజ్‌ బసిలియాన్‌ ఇంతకు ముందు గుడ్‌నైట్‌, లవర్‌, టూరిస్ట్‌ ఫ్యామిలీ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారన్నది గమనార్హం. అభిషన్‌ జీవింద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి ఆయన శిష్యుడు మదన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియాస్‌ కృష్ణ ఛాయాగ్రహణంను, శ్యాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నేటి యువత ఎంజాయ్‌ చేసే లవబుల్‌ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విత్‌ లవ్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర టీజర్‌ను, టైటిల్‌ను శుక్రవారం రజనీకాంత్‌ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్ర టీజర్‌ ఇప్పుడు ట్రెండింగ్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement