క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Nov 9 2025 7:23 AM | Updated on Nov 9 2025 7:23 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

రాయితో కొట్టి

వీఏఓ హత్య

అన్నానగర్‌: నాగై సమీపంలో వీఏఓను రాయితో కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. వివరాలు.. తిరువారూర్‌ జిల్లాలోని నన్నిలం సమీపంలోని వాళక్కరై గ్రామానికి చెందిన రాజారామన్‌ (35). ఇతని భార్య మనో చిత్ర. వీరి కుమారుడు దాస్విన్‌ (8). రాజా రామన్‌ నాగై జిల్లాలోని తిరుకువలై సమీపంలోని తిరువైమూర్‌ గ్రామానికి వీఏఓగా పనిచేస్తున్నాడు. ఇతను 2024 నుంచి ఎట్టుకుడి గ్రామానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు. ఆ సమయంలో, ఎట్టుకుడిలో రూ. 500 లంచం తీసుకున్నందుకు అతన్ని సస్పెండ్‌ చేశారు. ఈ కేసు నాగై కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ కేసులో హాజరు కావడానికి రాజారామన్‌ బైకుపై నాగైకి వచ్చాడు. కేసులో హాజరైన తర్వాత, కారైకల్‌లోని కొట్టుచేరిలోని తన అత్తమామల ఇంట్లో తన కొడుకును చూసిన తర్వాత రాత్రికి వళకరై వెళ్తున్నానని తన భార్యతో చెప్పి వచ్చాడు. కానీ రాజారామన్‌ అర్ధరాత్రి అయిన కాని ఇంటికి రాలేదు. అతని సోదరులు మనో చిత్రకు ఫోన్‌ చేసి ఈ విషయం అడిగారు. ఆ రాత్రి అతను వళకరైకి బయలుదేరాడని అతని భార్య చెప్పింది. దీనిపై అనుమానం వచ్చి రాజారామన్‌ కోసం వెతికారు. ఈ స్థితిలో, శనివారం తెల్లవారుజామున, నాగై–నాగూర్‌ తూర్పు తీర రోడ్డులోని సెల్లూర్‌ అనే ప్రదేశంలో రాజారామన్‌ బైకు పక్కకు లాక్‌ చేయబడి ఉండటాన్ని వారు చూశారు. వారు దగ్గరగా వెళ్లి చూసేసరికి, రోడ్డు పక్కన ఉన్న పొలంలో తలకు తీవ్ర గాయాలతో రాజారామన్‌ చనిపోయి పడి ఉండటం చూసి వారు దిగ్భ్రాంతి చెందారు. అతని సెల్‌ఫోన్‌, పర్సు కనిపించలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

మురుగు కాలువలో

మానవ అస్థిపంజరం

అన్నానగర్‌: చైన్నె కోయంబేడు పండ్ల మార్కెట్‌, నంబర్‌ 18 సమీపంలో, భూగర్భ మురుగునీటి కాలువను శుభ్రపరిచే పనులు జరుగుతున్నాయని స్టోర్‌ యాజమాన్యం తెలిపింది. శుక్రవారం సాయంత్రం, ఉద్యోగులు భూగర్భ మురుగునీటి కాలువను శుభ్రం చేస్తున్నప్పుడు, మురుగునీరు అకస్మాత్తుగా ప్రవహించడం ఆగిపోయింది. ఉద్యోగులు అడ్డంకిని తొలగించడానికి కిందికి దిగినప్పుడు, లోపల పడి ఉన్న మానవ అస్థిపంజరం చూసి వారు దిగ్భ్రాంతి తో కేకలు వేస్తూ పారిపోయారు. దాని గురించి షాపింగ్‌ పరిపాలనా అధికారి సెల్వనాయగం కు సమాచారం అందించారు. కానీ అతను రాలేదని తెలుస్తోంది. దీని గురించి సమాచారం అందిన తర్వాత, పోలీసులు వచ్చి మురుగు కాలువలో దొరికిన మానవ అస్థిపంజరాన్ని తీసుకున్నారు. అది పురుషుడి అస్థిపంజరమా లేక సీ్త్ర అస్థిపంజరమా అని పరిశీలించడానికి వారు మైలాపూర్‌లోని ల్యాబ్‌కు పంపారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు. మానవ అస్థిపంజరం మురుగు కాలువలో ఎలా వచ్చింది? ఎవరైనా చంపి మురుగు కాలువలో పడేశారా? శరీరం కుళ్ళిపోయి అస్థిపంజరంగా మారిందా..? అనే కోణంలో తీవ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కోయంబేడు మార్కెట్‌లో బైక్‌ దొంగతనాలు జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సెల్‌ఫోన్‌ దొంగతనాలు పెరుగుతున్నాయి. దోపిడీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కోయంబేడు పండ్ల మార్కెట్‌, గేట్‌ నంబర్‌ 18 ప్రాంతంలోని భూగర్భ నిల్వ ట్యాంక్‌లో మానవ అస్థిపంజరం దొరికింది. పోలీసులు దీనిపై తీవ్ర దర్యాప్తు చేయాలి అని వారు కోరారు.

పేద విద్యార్థుల కోసం

సంక్షేమ హాస్టల్‌

సాక్షి,చైన్నె : పేద పిల్లల కోసం సిరుగు బాలుర హాస్టల్‌ను శివారులోని పాక్కం గ్రామంలో సుయం చారిటబుల్‌ ట్రస్ట్‌, డిపీ వరల్డ్‌లు సంయుక్తంగా నిర్మించాయి. సీఎస్‌ఆర్‌ గ్రాంట్‌ మేరకు నిర్మించిన ఈ హాస్టల్‌ను శనివారం మాధవరం ఎమ్మెల్యే ఎస్‌ సుదర్శనం, టీఏహెచ్‌డీసీఓ డైరెక్టర్‌, ఐఎఎస్‌ కేస్‌ కందస్వామి, డీపీ వరల్డ్‌ప్రాంతీయ డైరెక్టర్‌ సీఎం మురళీధరన్‌లు ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన బాలుర హాస్టల్‌ను పూర్తిగా సౌరశక్తితో నడిచే విధంగా , పచ్చదనంతో కూడిన గ్రీన్‌ భవనంగా తీర్చిదిద్దారు. పేద, అణగారిక వర్గాల పిల్లలకు దోహద పడే విధంగా నిర్మించిన ఈ హాస్టల్‌ను విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా విస్తరించేందుకు తమ సహకారం అందిస్తామని ఈసందర్భంగా మురళీ ధరన్‌ ప్రకటించారు.

తెలంగాణ సీఎంకు

స్టాలిన్‌ శుభాకాంక్షలు

సాక్షి, చైన్నె: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమంలో శనివారం పోస్టు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌ అనుములకు జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొంటూ, ఆయన ఎప్పటికీ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, అనేక సంవత్సరాల పాటుగా ప్రజాసేవలో రాణించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement