సందడిగా క్రిస్మస్ కేక్ మిక్సింగ్
సాక్షి, చైన్నె: క్రిస్మస్ వేడుకలను ఆహ్వానిస్తూ చైన్నె నగరంలో కేక్ మిక్సింగ్ సెలెబ్రెషన్స్ సందడిగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా చైన్నె టి.నగర్‌లోని జీఆర్‌టీ హోటల్‌లో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ వేడుక శనివారం జరిగింది. క్రిస్మస్‌ను ఆహ్వానిస్తూ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసిన విద్యుత్ మయం చేశారు. జీఆర్‌టీ సీఈవో విక్రమ్ కోటతో పాటూ ప్రముఖ సెలెబ్రెటీలు తరలి వచ్చి కేక్స్ మిక్సింగ్‌లో సందడి చేశారు .120 కిలోల డ్రైఫ్రూట్‌లతో వివిధ రసాయన మిశ్రామంతో మిక్సింగ్ చేస్తూ హ్యాపీ క్రిస్మస్ ... మేరీ క్రిస్మస్ అంటూ నినాదాలు చేయడమే కాకుండా, చిన్నారుల క్రిస్మస్ గీతాల ఆలపాన అందరినీ వీనుల విందు చేశాయి.


