యూట్యూబ్ ఛానెల్స్ ఇతివృత్తంతో ‘పగల్ కనవు’
పగల్ కనవు
చిత్రంలో
పైసల్ రాజ్,
నటి ఆదిర సంతోష్
తమిళసినిమా: ఈ డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం మేలుతో పాటూ కీడును కూడా చేస్తోందనడానికి పలు ఉదాహరణలు ఉన్నాయి. పేరు, డబ్బు కోసం కొందరు యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా వాస్తవాలను ప్రసారం చేస్తే తప్పు కాదు కానీ ఆవాస్తవాలను ప్రచారం చేస్తే వచ్చే ముప్పు మాత్రం ఎక్కువ. ఇలాంటి ఇతివృత్తంతో రూపొందిన తాజా చిత్రం పగల్ కనవు. జాస్మిన్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఫైసల్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. క్రిష్ నందు, ఆదిర సంతోష్ ,స్కూల్ సురేష్, కరాటే రాజా, షకీలా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ నందన్ సంగీతాన్ని, జాయ్ ఆంటోనీ ఛాయాగ్రహణంను అందించారు. ఒక గ్రామానికి వచ్చిన యూట్యూబర్స్ అయిన హీరో, హీరోయిన్లు నటి షకీలా తయారు చేస్తున్న నకిలీ మద్యం గుట్టును ఈ యూట్యూబర్స్ రద్దు చేసే ప్రయత్నం చేయడమే. దీంతో కూల్ సురేష్ ఆ రౌడీల భారి నుంచి హీరో హీరోయిన్లను కాపాడుతాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్లు ఒక ఇంట్లో దెయ్యం తిరుగుతుందని భ్రమను కలిగించేలా వీడియోలు తీసి పాపులర్ అవ్వాలని భావిస్తారు. అందులోని అవాస్తవాన్ని మరో యూట్యూబ్ ఛానల్ బ్యాక్ భగ్నం చేస్తుంది. దీంతో ఫేక్ వీడియోలో నటించినందుకు గాను హీరోయిన్‌ను ఆమె తల్లిదండ్రులు మందలించి వేరే ఊరుకు పంపించేస్తారు. దీంతో ఆవేదన, ఆవేశానికి గురైన హీరో తన బృందంతో ఒక ఆత్మ సంచరిస్తున్న నిజమైన పాడుపడ్డ బంగ్లాకు వెళ్లి అక్కడ జరిగే దృశ్యాలను తన కెమెరాల బంధించి యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారం చేసి పాపులర్ అవ్వాలని భావిస్తాడు. అది సాధ్యమైందా..? ఆ ఆత్మ వల్ల హీరో బృందానికి ఎలాంటి ముప్పు వాటిల్లింది అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం పగల్ కనవు.
యూట్యూబ్ ఛానెల్స్ ఇతివృత్తంతో ‘పగల్ కనవు’


