నిండు కుండలా శరవణ పుష్కరిణి
కళకళలాడుతున్న పుష్కరిణి
తిరుత్తణి: ఇటీవల కురిసిన వర్షాలతో తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి శరవణపొయ్‌గై పుష్కరిణి నిండుకుండలా కళకళలాడుతోంది. ఇటీవల రూ.24 లక్షలతో పుష్కరిణిలో పూడికతీసి శుభ్రం చేశారు. దీంతో పుష్కరిణిలో తక్కువగా నీరు వుండడంతో భక్తులు ఇబ్బంది పడేవారు. కొళాయిల్లో వచ్చే నీటితో స్నానం చేసేవారు. ఈ క్రమంలో విస్తారంగా కురిసిన వర్షాలకు పుష్కరిణి నిండి నిండుకుండలా దర్శనమిస్తోంది. దీంతో భక్తులు ఆనందంతో స్నానం చేసి మెట్ల మార్గంలో కొండకు చేరుకుని స్వామి దర్శనం చేస్తున్నారు. చాలాకాలం తరువాత పుష్కరిణి నిండుకుండలా దర్శన మివ్వడం భక్తులకు ఆనందాన్ని నింపింది.


