
దీపావళికి భద్రతా ఏర్పాట్ల పరిశీలన
కొరుక్కుపేట: దీపావళికి టీనగర్ త్యాగరాయనగర్‌లో భద్రతా ఏర్పాట్లను అదనపు పోలీస్ కమిషనర్ పరిశీలించారు. అనంతరం సీసీ నిఘా కేంద్రం, పోలీసు సహాయ కేంద్రం, పునరుద్ధరించిన పోలీస్ జువైనల్ హాల్ భవనం, జిమ్‌ను ప్రారంభించారు. దీపావళి పండుగ సందర్భంగా టీనగర్, పాండిబజార్, మైలాపూర్, పూకడై, పురసైవాక్కం, వాషర్‌మన్‌పేట వంటి రద్దీ ప్రాంతాల్లో చైన్నె మెట్రోపాలిటన్ పోలీసులు ముమ్మర భద్రతా ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం, చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ అదనపు కమిషనర్ (సౌత్) ఎన్.కన్నన్, టి.నగర్‌లోని రంగనాథన్ స్ట్రీట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల మానిటరింగ్ సెంటర్‌ను, రంగనాథన్ స్ట్రీట్, ఉస్మాన్ రోడ్ జంక్షన్ వంతెన కింద కొత్తగా నిర్మించిన పోలీస్ అసిస్టెన్‌న్స్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.